ప్రస్తుతం ఆహార కొరతతో అల్లాడిపోనున్న దేశాలు ఇవే!

ఐక్యరాజ్య సమితికి చెందిన FAO (ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్), WFP (వరల్డ్ ఫుడ్ ప్రోగ్రాము) తాజాగా చాలా షాకింగ్ విషయాలు వెల్లడించాయి.ఆ రెండు సంస్థలు తెలిపిన వివరాల ప్రకారం, ప్రపంచంలోని పలు దేశాల్లో ఆహార కొరత( Food Shortage ) నెలకొనే ప్రమాదం ఉందని చాలా స్పష్టంగా తెలుస్తోంది.

 These Are The Countries That Will Suffer From Food Shortage Details, Countries,-TeluguStop.com

ఇప్పటికే ఆర్థిక, ఆహార, రాజకీయ సంక్షోభంలోకి దారుణంగా కూరుకుపోతోన్న పాకిస్థాన్( Pakistan ) సంగతి అందరూ వినే వుంటారు.మరికొన్ని నెలల్లో అక్కడ ఆహార కొరత కూడా దారుణంగా పెరగనుంది.

అక్కడ ఆర్థిక, రాజకీయ సంక్షోభం తగ్గకపోతే మాత్రం అక్కడి పరిస్థితి చాలా దుర్భరంగా మారనుంది.ఈ క్రమంలోనే పాకిస్థాన్ తో పాటు అఫ్గానిస్థాన్ కు( Afghanistan ) ఆహార కొరతపై ఎఫ్ఏఓ, డబ్ల్యూఎఫ్‌పీ ముందస్తు హెచ్చరికలు చేయడం గమనించదగ్గ విషయం.అదేవిధంగా తీవ్ర ఆహార కొరతను ఎదుర్కొనే దేశాల జాబితాలో పాకిస్థాన్, సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్, కెన్యా, ఇథియోపియా, కాంగో, సిరియన్ అరబ్ రిపబ్లిక్, మయన్మార్ ఉన్నాయి.ఈ దేశాలు ప్రస్తుత పరిస్థితులను మెరుగు పర్చుకోకపోతే రానున్న కొన్ని నెలల్లో ప్రజలు ఆకలితో అల్లాడే ప్రమాదం ఉంది.

ఇకపోతే, పాకిస్థాన్ పరిస్థితి ఎంత దారుణంగా తయారయ్యిందంటే… ఇతర దేశాలు కూడా దానికి అప్పులు ఇవ్వని పరిస్థితి నెలకొంది.రాజకీయ సంక్షోభంతో పాటు, IMF (ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్) పాక్ కు నిధులు ఇవ్వడంలో జాప్యం చేస్తుండడం ఆ దేశాన్ని మరింత సంక్షోభంలోకి నెట్టేస్తోందని విశ్వసనీయ వర్గాల సమాచారం.వచ్చే ఏడాది అక్టోబరులో పాకిస్థాన్ లో ఎన్నికలు జరగాల్సి ఉంది.దీంతో సంక్షోభం మరింత పెరిగే అవకాశాలు లేకపోలేదు.ఈ ఏడాది సెప్టెంబరు – డిసెంబరు మధ్య పాకిస్థాన్ లోని 85 లక్షల మంది ఆహార కొరతను ఎదుర్కొనే ముప్పు పొంచి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube