యాదాద్రి భువనగిరి జిల్లా
: బీసీ డిక్లరేషన్ పేరుతో బీసీలను మోసం చేస్తున్నారని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్( Jajula Srinivas Goud ) అన్నారు.సోమవారం భువనగిర్రి జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్( R&B Guest House ) లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీసీల రాజస్థాపన కొరకు పల్లె నుండి పట్నం వరకు ఓ బీసీ మేలుకో నీ రాజ్యం ఏలుకో అనే నినాదంతో జూన్ రెండు నుండి జూలై రెండు వరకు తెలంగాణలో అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటిస్తామని తెలిపారు.
ప్రతి నియోజకవర్గంలోని బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని బీసీ ప్రజలందరికీ వివరిస్తూ రాజకీయ అవగాహనతో పాటు ప్రతి ఒక్క బీసీలలో ఓటు చైతన్యన్ని నెలకొల్పుతామన్నారు.తెలంగాణలో అధిక జనాభా ఉన్న బీసీలకు ( BCs )అన్ని పార్టీలు రాజకీయ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు.
లేనియెడల పాత రోజులు పోయి కొత్త రోజులు వస్తున్నాయని,ఇక బీసీలకు జరుగుతున్న అన్యాయాలపై రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.
కేసీఆర్ సిట్టింగ్ లకు టిక్కెట్ ఇస్తే మరి బీసీల సంగతేంటని,బీసీలు ఓటు వేసే యంత్రాలా అని మండిపడ్డారు.
సిట్టింగ్ లకు టిక్కెట్ ఇస్తే బీఆర్ఎస్ నుఇంటికి పంపడం ఖాయమన్నారు.







