ఐసీసీ వన్డే ప్రపంచ కప్( ICC ODI World Cup ) 23 అక్టోబర్ 5 నుంచి మొదలు కాబోతున్న సంగతి అందరికీ విదితమే.ఇక ఈ టోర్నీ ఫైనల్ మ్యాచ్ నవంబర్ 19న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనున్న సంగతి కూడా మీరు వినే వుంటారు.
ఈ సందర్బంగా ప్రపంచకప్ చరిత్రను ఓసారి తిరగేస్తే మనకు ఎన్నో రికార్డుల మోతలు వినబడతాయి.అవును ఇపుడు మనం ఇక్కడ అత్యధిక పరుగులు, అత్యధిక వికెట్లు ఎవరు తీశారు, లిస్టులో ఎవరున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.

ఒకే ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు భారత మాజీ బ్యాట్స్‌మెన్ సచిన్ టెండూల్కర్ ( Sachin Tendulkar )పేరిట వుందన్న విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.సచిన్ టెండూల్కర్ 2003 ప్రపంచకప్‌లో 11 మ్యాచ్‌ల్లో 673 పరుగులు చేసి రికార్డు నెలకొల్పాడు.అయితే ఇప్పటి వరకు ఆ రికార్డుని మరెవ్వరూ టచ్ చేయలేకపోయారు.ఈ జాబితాలో రెండో స్థానంలో చెందిన మాథ్యూ హేడెన్ ( Matthew Hayden )కొనసాగుతున్నాడు.2007 ప్రపంచకప్‌లో మాథ్యూ హేడెన్ 659 పరుగులు చేసి ఔరా అనిపించాడు.అయితే మన మాస్టర్ బ్లాస్టర్ ని మాత్రం టచ్ చేయలేకపోయాడు.

అదేవిధంగా వన్డే ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో ఆస్ట్రేలియా మాజీ దిగ్గజం “గ్లెన్ మెక్‌గ్రాత్” ( Glenn McGrath )అగ్రస్థానంలో వెలుగొందుతున్నాడు.ప్రపంచకప్‌లో గ్లెన్ మెక్‌గ్రాత్ పేరిట 71 వికెట్లు ఉన్నాయి.కాగా, ఈ జాబితాలో వరుసగా ముత్తయ్య మురళీధరన్, వసీం అక్రమ్, చమిందా వాస్‌లు వరుసగా 2, 3, 4 స్థానాల్లో కొనసాగుతూ ఉన్నారు.ఇక వన్డే ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక సిక్సర్లు కొట్టిన రికార్డు వెస్టిండీస్ మాజీ ఆటగాడు క్రిస్ గేల్ పేరిట ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉంది.
ప్రపంచకప్‌లో క్రిస్ గేల్ అత్యధికంగా 49 సిక్సర్లు కొట్టాడు.అదే సమయంలో ఈ జాబితాలో ఏబీ డివిలియర్స్, రికీ పాంటింగ్, బ్రెండన్ మెకల్లమ్ వరుసగా 2, 3, 4 స్థానాల్లో వెలుగొందుతున్నారు.