అవును, వీటిని చూస్తే నిజమైనవిలాగే మనకు కనబడతాయి.కానీ నిజం కాదు.
పిల్లలు ఆడుకొనే బొమ్మలు లాగా ఉంటాయి… కానీ బొమ్మలు కావు.మరేమిటని తెలుసుకోవాలని వుందా.
అయితే ఈ కథ తెలుకోవలసిందే.బేసిగ్గా పేస్ట్రీ చెఫ్ అయిన ‘అమౌరీ గిచొన్‘ ఫ్రాన్స్‌లో పుట్టాడు.
కొత్త రకం వంటలు చేయడం, ఫుడ్‌ని అందంగా డెకరేట్ చేయడం మీద అతనికి మక్కువ ఎక్కువ కావడంతో చదువు మీద పెద్దగా ఇంట్రెస్ట్ పెట్టలేకపోయేవాడు.దాంతో 14 ఏండ్లకే స్కూల్ కి టాటా చెప్పేసాడు.
చిన్న పిల్లలకు మళ్లే ఇతనికి కూడా చాక్లెట్ అంటే మస్త్ ఇష్టం.అయితే ఇతను అందరిలా చాక్లెట్లని తినడానికి పుట్టలేదు.
అవును.చాకోలెట్ రూపంలో వున్న పక్షులు, జంతువులు, వివిధ వాహనాలు, పరికరాల బొమ్మలు తయారుచేయడానికి పుట్టాడు మన అమౌరీ.ఈ క్రమంలో ఈమధ్యే చాక్లెట్‌తో ఓ బైక్ బొమ్మ తయారుచేసి శెభాష్ అనిపించుకున్నాడు.ఇంకా అతను చాకొలేట్ తో చేసిన పెద్ద నత్త, పుట్టగొడుగు బొమ్మల ఫొటోలు, వీడియోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
తల్లిదండ్రులు కూడా అతడికి సపోర్ట్ ఇవ్వడంతో కలినరీ ఆర్ట్‌లో 2 ఏళ్ళ కోర్సు పూర్తి చేశాడు.తర్వాత వుల్ఫ్స్ బర్గ్ కాలేజీలో ఓ 2 ఏళ్ళ పేస్ట్రీ కోర్స్‌లో చేరాడు.
ఆ వెంటనే మనోడికి ఒక బేకరీలో కేక్, పేస్ట్రీ డెకరేటర్‌గా జాబ్ వచ్చింది.

దాదాపు అలా 15 ఏళ్ళు పలు బేకరీల్లో కేక్, పేస్ట్రీ డెకరేటర్‌గా పని చేసి, ఫ్రాన్స్‌లోనే కాకుండా అమెరికాలో కూడా పాపులర్ పేస్ట్రీ చెఫ్‌గా పేరు తెచ్చుకున్నాడు అమౌరీ.ఫ్రాన్స్‌లో “వు విల్ బి ది నెక్స్ట్ గ్రేట్ పేస్ట్రీ చెఫ్” అనే టీవీ రియాలిటీ షోలో పార్టిసిపేట్ చేసి, మూడో ప్లేస్‌లో నిలిచి అందరి దృష్టిని ఆకర్శించాడు.అనంతరం మూడేండ్ల క్రితం అమెరికాలోని లాస్‌వెగాస్‌లో సొంతంగా కేక్, పేస్ట్రీ షాపు పెట్టాడు అమౌరీ.
ఆ షాప్ కి “ది పేస్ట్రీ అకాడమీ” అని పేరు పెట్టాడు.అప్పటినుంచి కేక్‌ల డెకరేషన్తో పాటు చాక్లెట్లతో జంతువులు, పక్షులు, రకరకాల బొమ్మలు తయారు చేసి, తన యూట్యూబ్ ఛానల్ లో పోస్ట్ చేస్తున్నాడు.
కావాలంటే చూసేయండి మరి.