మనం అనేక సంవత్సరాలుగా చూస్తున్నాం అనేక సినిమాలని.హాలీవుడ్లో దాదాపుగా ఏలియన్ కంటెంట్ సినిమాలే ఎక్కువగా రూపొందుతుంటాయి.
దీనికి అనేక కారణాలు వున్నాయి.అంతరిక్ష పరిశోధనలో భాగంగా ఈ అనంతకోటి విశ్వంలో భూమిలాంటి గ్రహాలకోసం, అలాగే గ్రహాంతర వాసుల కోసం అన్వేషణ నేటికీ నిరంతరంగా కొనసాగుతూనే ఉంది.
ఈ క్రమంలో పాలపుంతపై పరిశోధన చేస్తున్న శాస్త్రవేత్తలు తాజాగా ఓ సంచలన విషయం ప్రకటించారు.అదేమిటంటే, మన పాలపుంతలో ఇప్పటికే కొన్ని గ్రహాల్లో జీవులు ఉన్నాయని, అవి రానున్న రోజుల్లో భూమిపై దాడికి దిగుతాయని శాస్త్రవేత్తలు ఓ భయంకరమైన విషయాన్ని వెల్లడించారు.
దాంతో పాలపుంతలో వున్న ఓ నాలుగు గ్రహాల్లో నాగరికత ఏర్పరచుకున్న గ్రహాంతర వాసుల నుంచి భూమికి ప్రమాదం పొంచి ఉందనే విషయం ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.స్పెయిన్‌లోని ‘యూనివర్శిటీ ఆఫ్ విగో’లో PhD చేస్తున్న అల్బెర్టో కాబల్లెరో అనే విద్యార్థి, 1977లో కనుగొనబడిన “WoW సిగ్నల్ ” యొక్క ఖచ్చితమైన మూలాన్ని తాను గుర్తించినట్లు ‘vice’ మీడియాతో చెప్పడమే ఇపుడు దానికి బీజం వేసినట్టుగా కనబడుతోంది.
ఇది భూమికి 1,800 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న సూర్యుడిలాంటి నక్షత్రం నుండి ఉద్భవించిందని ఆయన పేర్కోవడం కొసమెరుపు.

ఇందులో భాగంగా 1977లో వచ్చిన వావ్ సిగ్నల్ సహా భూమిపైకి చేరిన ఇతర ఆక్రమణల సంఖ్యను కూడా లెక్కించిన కాబల్లెరో అనంతరం పాలపుంతలో గ్రహశకలాల అంచనా సంఖ్యకు దీనిని వర్తింపజేశాడు.అతని లెక్కల ప్రకారం, భూ గ్రహంపై దాడి చేయగల గ్రహాంతర నాగరికతల సంఖ్య 4 అన్నట్టు చెబుతున్నాడు.ఈక్రమంలో METI (మెసేజింగ్ ఎక్స్ ట్రా టెర్రిస్ట్రియల్ ఇంటెలిజెన్స్) పద్ధతిని ఉపయోగించుకోవడంలో మనం జాగ్రత్తగా ఉండాలని ఆయన శాస్త్రవేత్తలను హెచ్చరించారు.
కాగా ఇటీవలి కాలంలో గ్రహాంతర జీవుల గురించి అమెరికా చేస్తున్న పరిశోధనలు, ప్రకటనల నేపథ్యంలోనే అల్బెర్టో కాబల్లెరో రాసిన వ్యాసం వెలుగులోకి రావడం ప్రాధాన్యత సంతరించుకుంది.







