లివర్ ఆరోగ్యాన్ని పెంచే ఈ 5 రకాల పండ్లను మీరు తింటున్నారా..?

మానవ శరీరంలో అతి ముఖ్యమైన అవయవాల్లో కాలేయం( Liver ) ఒకటి.ఇది మొత్తం ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో కీలక పాత్ర పోషిస్తుంది.

నిర్విషీకరణ, జీవక్రియ మరియు పోషకాల నిల్వకు బాధ్యత వహిస్తుంది.అటువంటి లివర్ ను ఆరోగ్యంగా ఉంచుకోవడం మన బాధ్యత.

అయితే లివ‌ర్ ఆరోగ్యానికి కొన్ని కొన్ని ఆహారాలు అద్భుతంగా సహాయపడతాయి.ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయే ఐదు రకాల పండ్లు తీసుకుంటే మీ లివర్ ఆరోగ్యానికి ఎటువంటి ఢోకా ఉండ‌దు.

మరి ఇంతకీ ఆ ఐదు రకాల పండ్లు ఏవేవో ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

బొప్పాయి పండు( Papaya ) రుచిగా ఉండడమే కాదు బోలెడన్ని పోషకాలు కలిగి ఉంటుంది.గుండె, జీర్ణక్రియ మరియు రోగనిరోధక వ్యవస్థ కు బొప్పాయి ఎంతో మంచిది.జీర్ణక్రియకు సహాయం చేయడం ద్వారా.

బొప్పాయి కాలేయం పై పని భారాన్ని తగ్గిస్తుంది.లివర్ మరింత సమర్థవంతంగా పని చేసేలా ప్రోత్సహిస్తుంది.

కాబట్టి లివ‌ర్ ఆరోగ్యానికి కచ్చితంగా బొప్పాయిని డైట్ లో చేర్చుకోండి.

కాలేయానికి మేలు చేసే పండ్ల‌లో గ్రేప్స్( Grapes ) కూడా ముందు వ‌రుస‌లో ఉంటాయి.గ్రేప్స్ లో ఉండే శ‌క్తివంత‌మైన యాంటీ ఆక్సిడెంట్స్ మ‌రియు ప‌లు సమ్మేళనాలు లివ‌ర్ ఫ్యాట్ ను క‌రిగిస్తాయి.బ్యాక్టీరియా నుండి కాలేయాన్ని ర‌క్షిస్తాయి.

బాలయ్య టాక్ షోకు పోటీగా రానా టాక్ షో.. ఆ ప్రముఖ షోకు హాజరయ్యే గెస్టులు వీళ్లే!
వయనాడ్ ఎన్నికల బరిలోకి నవ్య హరిదాస్.. అసలు ఎవరు ఈమె..?

అలాగే లివ‌ర్ ఆరోగ్యానికి అవ‌కాడో ఎంతో అవ‌స‌రం.రోజుకు ఒక అవ‌కాడో పండును తింటే అనేక కాలేయ సంబంధిత జ‌బ్బుల‌కు దూరంగా ఉండొచ్చ‌ని నిపుణులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

Advertisement

బెర్రీ పండ్లు( Berry Fruis ) కాలేయానికి చాలా మేలు చేస్తాయి.స్ట్రాబెర్రీలు, రాస్ప్ బెర్రీస్ మరియు బ్లాక్ బెర్రీస్ లో యాంటీ ఆక్సిడెంట్స్ మెండుగా నిండి ఉంటాయి.ఇవి కాలేయ ఆరోగ్యాన్ని, ప‌నితీరును చ‌క్క‌గా పెంచుతాయి.

ఇక కివీ పండు కూడా మీ కాలేయ ఆరోగ్యానికి మద్దతు ఇస్తుంది.కివీ పండులో లివర్ వ్యాధులను ఎఫెక్టివ్‌గా నిరోధించే పోష‌కాలు పుష్క‌లంగా ఉంటాయి.

కాబ‌ట్టి, కివీ పండును ఆహారంలో భాగం చేసుకోండి.

తాజా వార్తలు