ఇలాంటి గాడ్జెట్‌.. ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాల్సిందే!

నేడు పల్లె, పట్టణం అని తేడా లేకుండా మనుషుల్ని వేధిస్తున్న సమస్య దోమలు.(Mosquitoes) అవును, దోమల వలన అనేక రోగాలు సోకి మనిషి నిర్వీర్యం అయిపోతున్నాడు.

 Thermacell Electric Mosquito Repellent Keeps Mosquitoes Away Details, Gadgets, T-TeluguStop.com

పట్టణాల సంగతి పక్కనబెడితే ఒకప్పుడు పల్లెటూళ్లలో దోమల బెడద చాలా తక్కువ ఉండేది.కానీ నేడు పరిస్థితి రివర్స్ అయిందని చెప్పుకోవచ్చు.

మరీ ముఖ్యంగా చిన్నపిల్లలు వున్న ఇళ్లల్లో దోమలు ఉంటే సంతేసంగతి.ఈ క్రమంలో దోమల నివారణకు చాలా పరికరాలు మార్కెట్లోకి అందుబాటులో వచ్చాయి కానీ, వాటి వలన సైడ్ ఎఫెక్ట్స్ అనేవి కూడా వున్నాయి.

సాధారణ కాయిల్ వాడినా, గుడ్ నైట్ కాయిల్ వాడినా దోమల ప్రభావం తగ్గుతుంది కానీ, వాటినుండి వెలువడిన రసాయనాలు మనుషులకు హానికరం చేస్తాయి అనే సంగతి అందరికీ తెలిసినదే.ఈ నేపథ్యంలోనే ఓ అదిరిపోయే ప్రోడక్ట్ మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చింది.ఇక్కడ మీకు ఫొటోలో కనిపిస్తున్న పరికరం చూడండి.ఇది మీ ఇళ్లల్లో వున్న దోమల్ని, అలాగే ఆరుబయటి వున్న దోమలతో పాటు ఇతర కీటకాలను కూడా క్షణాల్లో నశింపజేస్తుంది.

దానిని ‘థర్మాసెల్‌’(Thermacell) అనే అమెరికన్‌ కంపెనీ రూపొందించింది.

అందుకే దీనికి ‘థర్మోసెల్‌ ఈఎల్‌55’(Thermacell EL55) అనే పేరు పెట్టారు.ఇది రీచార్జబుల్‌ బ్యాటరీ సాయంతో పనిచేస్తుంది.దీనిని గదిలోనే కాకుండా ఆరుబయట కూడా పెట్టుకోవచ్చు.

దోమలను పారదోలడంతో పాటు ఇది లాంతరులా కూడా పనిచేయడం విశేషం.ఇతర పరికరాల మాదిరిగా ఇందులో ఎలాంటి రసాయనాలను వాడనవసరం లేదు.

కాబట్టి ఇబ్బందికరమైన వాసనలేవీ దీని నుంచి వెలువడవు.అందుకే ఇది మనుషులకు క్షేమకరం అని కంపెనీవారు చెబుతున్నారు.ఇక దీని ధర విషయానికొస్తే… 49.99 డాలర్లు, అంటే మన ఇండియన్ కరెన్సీలో కేవలం రూ.4,126 మాత్రమే!

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube