సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన ‘రాకీ భాయ్‘ అంటే సూపర్ స్టార్ యష్ జనవరి 8న తన 37వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు.ఆరోజు సోషల్ మీడియాలో యష్‌కి అభిమానులు, స్నేహితుల నుండి లెక్కకుమించి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.‘కెజిఎఫ్’ చిత్రంతో, యష్ కేవలం భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఖ్యాతిని సంపాదించారు.వినోద ప్రపంచంలో అతనిది అందెవేసిన చేయిగా మారింది.
బస్సు డ్రైవర్ కుమారుడి స్థాయి నుండి సూపర్ స్టార్ అయ్యే వరకు యష్ కథ అందరికీ స్ఫూర్తిగా నిలుస్తుంది.యష్ నిజ జీవితంలోని కొన్ని ఆసక్తికర వాస్తవాలను ఇప్పుడు తెలుసుకుందాం.
యష్ అసలు పేరు.కన్నడ సూపర్ స్టార్ యష్ 1986 జనవరి 8న కర్ణాటకలోని హాసన్ నగరంలోని బోవనహళ్లి గ్రామంలో జన్మించారు.
కేజీఎఫ్ స్టార్‌గా అభిమానులు, పరిశ్రమ జనాలకు అతని పేరు యష్ అని తెలుసు, కానీ అతని అసలు పేరు నవీన్ కుమార్ గౌడ.అతని మరొక పేరు ‘యశ్వంత్‘.అతను ఈ పేరును యష్‌గా కుదించారు.అవును.
ఈరోజు అతను సూపర్‌స్టార్ కావచ్చు, కానీ అతనికి విజయపథం అంత సులభంగా కొనసాగలేదు.అతని తండ్రి అరుణ్ కుమార్ గౌడ కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ, బెంగుళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్‌లో బస్సు డ్రైవర్‌గా పనిచేశారు.
అతని తల్లి గృహిణి.

నటన కోసం చదువు మానేయాలనుకున్నారు.మీడియా కథనాల ప్రకారం నటనపై ఇష్టంతో యష్ తన పాఠశాల చదువును విడిచిపెట్టాలని అనుకున్నారు.అయితే తల్లిదండ్రుల ప్రోత్సాహంతో చదువు పూర్తి చేశారు.
యష్ తండ్రి తన కుమారుడు కూడా తనలాగే ప్రభుత్వ ఉద్యోగం చేయాలనుకున్నారు.తండ్రి కుమారుని నటనాభిలాషకు మద్దతు ఇవ్వలేదు.అయితే యష్‌కి అదృష్టం కలిసివచ్చింది.2007లో ‘జంబద హుడుగి’ సినిమాతో వెండి తెరపై అడుగుపెట్టారు.ఇంతకుముందు యష్ ఉత్తరాయణ్, సిల్లి లల్లి, నంద గోకుల, ఇతర కన్నడ టీవీ షోలలో పనిచేశారు.

భార్య రాధికతో తొలి పరిచయం ఇలా.2008లో వచ్చిన రొమాంటిక్ డ్రామా చిత్రం ‘రాకీ’లో యష్ తొలిసారిగా ప్రధాన నటుడిగా ఎంపికయ్యాడు.యష్ తన రెండవ చిత్రం ‘మొగ్గిన మనసు’ సెట్‌లో రాధిక పండిట్‌ను కలిశారు.అది మొదలు ఇద్దరూ స్నేహితులయ్యారు.2012 లో రహస్యంగా వివాహం చేసుకున్నారు.ఈ సినిమాతో యష్‌కి పాపులారిటీ రావడమే కాకుండా జీవిత భాగస్వామి కూడా దొరికింది.యష్, రాధిక దంపతులకు ఇద్దరు పిల్లలు, కుమార్తె ఐరా 2018లో జన్మించింది.కుమారుడు యథర్వ యష్ ఒక సంవత్సరం తరువాత జన్మించాడు.కన్నడ చిత్ర పరిశ్రమలో అగ్ర నటునిగా యష్ పేరుపొందాడు.యష్ నటించిన చిత్రం కేజీఎఫ్ రూ.200 కోట్ల మార్కును దాటింది.