ఎన్టీఆర్( NTR ) శత జయంతి వేడుకలలో భాగంగా విజయవాడలో భారీ బహిరంగ సభలో నిర్వహించిన విషయం తెలిసిందే.అయితే ఈ కార్యక్రమం ఎలాంటి వివాదాలకు దారితీసిందో అందరికీ తెలిసిందే.
ఈ కార్యక్రమానికి సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) ముఖ్య అతిథిగా హాజరవ్వడమే కాకుండా ఈ కార్యక్రమంలో సీనియర్ ఎన్టీఆర్ తో తనకున్నటువంటి అనుబంధం గురించి తెలియజేశారు.అలాగే హైదరాబాద్ చూస్తే తనకు న్యూయార్క్ సిటీ చూసిన ఫీలింగ్ కలుగుతుందని అంత అభివృద్ధి చెందడానికి చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) కారణమని కూడా రజనీకాంత్ తెలిపారు.

చంద్రబాబు నాయుడు విజన్ చాలా పెద్దదని ఆయన వల్లే హైదరాబాద్( Hyderabad ) అభివృద్ధి సాధ్యమైంది అంటూ చంద్రబాబు గురించి రజనీకాంత్ గొప్పగా మాట్లాడారు.అయితే చంద్రబాబు నాయుడు గురించి రజనీకాంత్ ఇలా మాట్లాడటం ఓర్చుకోలేనటువంటి వైసీపీ( ycp ) నేతలు పెద్ద ఎత్తున రజనీకాంత్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.దీంతో మండిపడిన రజనీకాంత్ అభిమానులు వైసిపి ప్రభుత్వం రజనీకాంత్ ఒక క్షమాపణలు చెప్పాలని కోరారు.అయితే ఇవి వాదం ముగిసిందనుకున్న అక్కడక్కడ ఈ వివాదం గురించి చర్చలు జరుగుతున్నాయి.

ఓ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా జగపతిబాబు(Jagapathi Babu) పాల్గొనగా ఈ విషయం గురించి ప్రస్తావనకు వచ్చింది.అయితే ఆయన మాట్లాడుతూ…రజనీకాంత్ ఎప్పుడు మాట్లాడిన తప్పు మాట్లాడరు అబద్ధాలు మాట్లాడరు ఆయన మాట్లాడే వన్ని నిజాలే అంటూ కామెంట్ చేశారు .అయితే తాజాగా హీరో సుమన్(Suman) ఒక ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన మాట్లాడుతూ…ఎన్టీఆర్ శక్తి జయంతి వేడుకలలో రజనీకాంత్ మాట్లాడిన మాటలలో ఎక్కడ తప్పు లేదని తెలిపారు.
ఇప్పుడు హైదరాబాద్ ఇలా ఉందంటే అందుకు కారణం చంద్రబాబు నాయుడని సుమన్ తెలిపారు.అవును.ఆ సమయంలో కొన్ని మిస్టేక్స్ జరిగాయి.కానీ, ఈరోజు ఉన్న హైదరాబాద్ కు ఒక రూపం తీసుకువచ్చింది.
ఇక రాజకీయమన్న తర్వాత ఎత్తు పలాలు ఉండడం సర్వసాధారణం ఒకసారి ఒకరు వస్తే ఇంకొకసారి మరొకరు వస్తుంటారు.చంద్రబాబు నాయుడు ఒక మంచి సీఎం కూడా అయితే ప్రస్తుతం ఆయన టైం బాలేకపోవడంతో ప్రజలు మార్పును కోరుకుంటున్నారని అంతేకానీ ఆయన చేసింది చేయలేదని చెప్పలేం అంటూ సుమన్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.