ఏపీలో ఆడబిడ్డలకు రక్షణ లేదని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు.ఆడబిడ్డల సంబంధాల గురించి వాలంటీర్లకు ఏం సంబంధమని ప్రశ్నించారు.
చెప్పుతో కొట్టేవాడు లేక ఇలాంటి ప్రశ్నలు అడుగుతున్నార్నన ఆయన ఎప్పుడు ఎవరొచ్చి యాసిడ్ పోస్తారో తెలియదని చెప్పారు.రేపల్లెలో దారుణం జరిగితే సీఎం ఎందుకు వెళ్లలేదో చెప్పాలన్నారు.
సీఎం కుటుంబ సభ్యులకు ఏదైనా జరిగితే స్పందించరా అని ప్రశ్నించారు.నాయకుడు సక్రమంగా ఉంటే మన ప్రాణాలకు రక్షణ ఉంటుందని తెలిపారు.
ఇష్టానుసారం కరెంట్ బిల్లులు పెంచేశారని మండిపడ్డారు.ఇసుక ఇతర రాష్ట్రాలకు తరలిపోతోందని చంద్రబాబు ఆరోపించారు.







