టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ వ్యవహారంపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు.బలమైన ఆధారాలతోనే చంద్రబాబును పోలీసులు అరెస్ట్ చేశారని తెలిపారు.
ఆధారాలు ఉంటే దర్యాప్తులో భాగంగా అరెస్ట్ చేస్తారని సజ్జల పేర్కొన్నారు.ఈ కేసులో ముందే నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదన్న ఆయన కుంభకోణం దర్యాప్తులో రాజకీయ ప్రమేయం లేదని తేల్చి చెప్పారు.
ఎఫ్ఐఆర్ కు ముందే జీఎస్టీ నిఘాలో స్కామ్ బయటపడిందని తెలిపారు.పథకం ప్రకారం రూ.371 కోట్లు కొల్లగొట్టారని సజ్జల ఆరోపించారు.రెండేళ్ల తరువాత దర్యాప్తు అనంతరం చంద్రబాబును సీఐడీ సిట్ అధికారులు అరెస్ట్ చేశారన్న సజ్జల తరువాత ఏం జరగాలన్నది కోర్టు నిర్ణయిస్తుందని వెల్లడించారు.