బిగ్ బాస్( Bigg Boss ) కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నేహా చౌదరి ( Neha Chowdary ) ఒకరు.ఈమె బిగ్ బాస్ కార్యక్రమానికి రాకముందు స్పోర్ట్స్ యాంకర్ గాను, వ్యవహరించారు అయితే బిగ్ బాస్ కార్యక్రమానికి వచ్చేవరకు కూడా ఈమె గురించి పెద్దగా ఎవరికి తెలియకపోయినా బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా మాత్రం ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.
నేహా చౌదరి బిగ్ బాస్ కార్యక్రమంలో కొనసాగినది కొద్దిరోజులు అయినప్పటికీ ఈమె ఎంతో మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు.

ఇక బిగ్ బాస్ కార్యక్రమం నుంచి 5 వారాలకి బయటకు వెళ్లినటువంటి ఈమె బిగ్ బాస్ కార్యక్రమం ముగిసేలోపు పెళ్లి కూడా చేసుకున్నారు.తన స్నేహితుడిని ప్రేమించి పెద్దల సమక్షంలో ఎంతో అంగరంగ వైభవంగా నేహా చౌదరి వివాహం చేసుకున్నారు.ఇలా వివాహం జరిగిన తర్వాత ఈమె తన భర్తతో కలిసి సోషల్ మీడియా( Social media )లో ఎంతో యాక్టివ్ గా ఉంటూ తరచు వారికి సంబంధించినటువంటి విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు.

ఈ క్రమంలోనే పలు బుల్లితెర కార్యక్రమాలలో కూడా నేహా చౌదరి సందడి చేస్తున్న విషయం మనకు తెలిసిందే.ఇకపోతే నేహ చౌదరి తన భర్తతో కలిసి జర్మనీ(Germany)లో నివాసం ఉంటున్నారు.ఇలా జర్మనీలో ఉంటున్నటువంటి ఈమె యూట్యూబ్ ఛానల్ కూడా ప్రారంభించి తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు.ఈ క్రమంలోనే చాలామంది జర్మనీలో ఉన్నటువంటి తన హోమ్ టూర్ వీడియో చూపించమని అడగడంతో నేహ చౌదరి జర్మనీలో ఉన్నటువంటి ఇంటి హోం టూర్ వీడియోని తన యూట్యూబ్ ఛానల్ ద్వారా షేర్ చేశారు.

జర్మనీలో ఉన్నటువంటి ఈ ఇంటిలో బాల్కనీ ఏరియా నుంచి మొదలుకొని కిచెన్ హాల్ అన్నింటిని చూపిస్తూ వివరిస్తూ నేహ చౌదరి హోమ్ టూర్ వీడియోని చేశారు.ప్రస్తుతం ఈమె హోమ్ టూర్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇది చూసినటువంటి నెటిజన్స్ నేహా చౌదరి జర్మనీలో ఉన్నటువంటి ఇల్లు చాలా అద్భుతంగా ఉంది అంటూ కూడా కామెంట్స్ చేస్తున్నారు.ఇలా సోషల్ మీడియా వేదికగా ఇంస్టాగ్రామ్ రీల్స్( Instagram ) ద్వారా ఈమె తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు.
ఈ క్రమంలోని సోషల్ మీడియాలో కూడా నేహా చౌదరికి విపరీతమైనటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది
.







