పెద్దపల్లి జిల్లా అప్పన్నపేటలో తీవ్ర ఉద్రిక్తత

పెద్దపల్లి జిల్లా అప్పన్నపేటలో( Appannapet ) తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది.అప్పన్నపేట సొసైటీ ఛైర్మన్( Appannapet Society Chairman ) అవిశ్వాసం వ్యవహారంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది.

సొసైటీ ఛైర్మన్ దాసరి చంద్రారెడ్డిపై( Dasari Chandra Reddy ) మరో వర్గం సభ్యులు అవిశ్వాసం పెట్టారు.13 మంది డైరెక్టర్లకు గానూ పదకొండు మంది సభ్యులు దాసరి చంద్రారెడ్డిని వ్యతిరేకించారు.ఈ నేపథ్యంలో ఛైర్మన్ పదవి కోసం చింతపండు సంపత్, ఆరే తిరుపతి పోటీ పడ్డారని తెలుస్తోంది.

మెజార్టీ డైరెక్టర్ల సపోర్ట్ తనకే ఉన్నప్పటికీ డబ్బులు పంచి వారిని చింతపండు సంపత్( Chintapandu Sampath ) తన వైపుకు తిప్పుకున్నాడని ఆరే తిరుపతి ఆరోపించారు.ఈ క్రమంలోనే డైరెక్టర్లను అడ్డుకున్న తిరుపతి వర్గీయులు కారుపై దాడికి పాల్పడ్డారు.ఆ కారులో నుంచి డబ్బులు బయపడటంతో డైరెక్టర్లను సంపత్ వేరే కారులో తరలించారని తెలుస్తోంది.

దీంతో అప్పన్నపేట సొసైటీ వద్ద హైటెన్షన్ వాతావరణం ఏర్పడింది.

అప్పుడు 100 రూపాయలు.. ఇప్పుడు రూ.300 కోట్లు.. బన్నీ సక్సెస్ స్టోరీకి ఫిదా అవ్వాల్సిందే!
Advertisement

తాజా వార్తలు