నల్లమిరియాలను సుగంధ ద్రవ్యాలు, వైద్యశాస్త్రంలో ఉపయోగించే బెర్రీల కోసం పండించే ఒక శాశ్వత ద్రాక్షావలి.నల్ల మిరియాలను సాగు చేసే నేల యొక్క పీహెచ్ విలువ 5.5 నుంచి 7 మధ్య ఉండాలి.నల్ల మిరియాలు( Black pepper ) ప్రధానంగా వర్షపు పంటగా పండించబడతాయి.
నల్లమిరియాలకు భారీ వర్షపాతం, అధిక తేమ మరియు వెచ్చని వాతావరణం చాలా అనుకూలంగా ఉంటాయి.అయితే ఈ నల్ల మిరియాల సాగుకు కాస్త తెగుళ్ల బెడద ఎక్కువే.
ఈ తెగుళ్లను సకాలంలో గుర్తించి వెంటనే సంరక్షక చర్యలు తీసుకోవాలి.వేరు కుళ్ళు తెగుళ్లు మిరియాల పంటను ఆశిస్తే ఎలా గుర్తించాలి అంటే.
తడి వాతావరణంలో ఆకులపై, కాండాలపై గాయాలు ఏర్పడతాయి.ఆకులు వేగంగా వాడిపోవడం మరియు రాలిపోవడం జరుగుతుంది.
మెటాక్సిల్ మరియు ఫోసెటైల్ లాంటి దైహిక శిలీంద్ర నాశినులను ఉపయోగించి ఈ వేరుకొల్లును నియంత్రించవచ్చు.

చారల మీలీబగ్ తెగుళ్లు పంటను ఆశిస్తే మొక్కల ఎదుగుదల ఆగిపోవడంతో పాటు ఆకులు పసుపు రంగులోకి మారుతాయి.బూడిద రంగు బూజుల( Grey mildew ) ద్వితీయ పెరుగుదలను ఇవి ప్రోత్సహిస్తాయి.మీనపు తెల్లని దారాలతో కప్పబడి ఉంటాయి.
రుతుపవనాల తర్వాత ఈ మిలీబగ్స్ చాలా సమృద్ధిగా ఉంటాయి.వ్యవసాయ క్షేత్ర నిపుణుల సలహా తీసుకొని రసాయన పిచికారి మందులు ఉపయోగించాలి.

భారతదేశంలో మిరియాల పంట డిసెంబర్ లేదా జనవరి మధ్య కోతకు వస్తుంది.మంచి ఉత్పత్తిని సాధించాలంటే మెచ్యూరిటీ యొక్క సరైనదశలో మిరియాలను కోయడం ముఖ్యం.ఒకటి లేదా రెండు బెర్రీలు పసుపు రంగులోకి మారినప్పుడు కోత ప్రారంభించాలి.కోతల తర్వాత పంటను నిల్వ చేయాలంటే.పది శాతం కంటే తక్కువ తేమా ఉండేలా మిరియాలను ఎండబెట్టాలి.ఆ తర్వాత జనపనార సంచులలో నింపి నిల్వ చేయాలి.







