కరోనా తరువాత పరిస్థితులు ఎలా మారాయో ఇక్కడ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ముఖ్యంగా నిత్యవసర వస్తువుల ధరలు భగ్గుమన్నాయి.
మరీ ముఖ్యంగా ఆయిల్ ధరలు ఆకాశాన్నంటాయి.ఇపుడెప్పుడే ఆ పరిస్థితి కాస్త మెరుగవుతూ వస్తోంది.
అయినా ఇంకా మెరుగుపడాల్సి వుంది.ఎందుకంటే నిత్యవసర ధరలు పెరగడంతో సామాన్యులకు బతకలేని పరిస్థితి వుంది.
ఈ క్రమంలో సామాన్యులకు తీపి కబురు అందనుంది.ఏకంగా రూ.40 కే వంట నూనె పొందే అవకాశం వుంది.

ఇకపోతే, గత కొన్ని రోజుల నుంచి వంట నూనె ధరలు( Cooking oil prices ) కాస్త తగ్గుముఖం పడుతూ వస్తున్నాయి.రానున్న రోజుల్లో ఈ ధరలు మరింత తగ్గే అవకాశం ఉన్నట్లు లేకపోలేదు.అయితే ఇలాంటి క్రమంలో వంటనూనెపై హిమాచల్ ప్రభుత్వం ఓ కీలక ప్రకటన చేయడం విశేషం.
అవును, వారు వంట నూనెపై సబ్సిడీ ఆఫర్ చేస్తున్నట్లు తెలుస్తోంది.రేషన్ కార్డు ( Ration card )ఉన్నవారికి సబ్సిడీలో తక్కువ ధరకే వంటనూనెను అందివ్వనుందంట.దాంతో గతంలో ఉన్న ధరలతో పోలిస్తే ఇప్పుడు లబ్దిదారులకు లీటరుకు రూ.37 తక్కువ ధరకు నూనె లభిస్తుందని ఆయన చెప్పడం కొసమెరుపు.

అంటే, లీటరుకు అక్కడ రూ.40కే వంట నూనె దొరికే పరిస్థితి ఉందని తెలుస్తోంది.ఇదే నిజమైతే అక్కడ సామాన్యులకు ఇది పెద్ద శుభవార్తే అని చెప్పుకోవాలి.ఎందుకంటే, సగటు ఓ కుటుంబం నెలకు నాలుగు నుండి ఐదు లీటర్ల వంటనూనెని వాడడం ఇక్కడ జరుగుతుందని చెప్పుకోవచ్చు.
ఈ లెక్కన వారు దాదాపుగా నెలకు 200 నుండి 300 రూపాయిల వరకు అదా చేసే అవకాశం కలదు.
