అక్కడ రూ.40కే వంట నూనె!
TeluguStop.com
కరోనా తరువాత పరిస్థితులు ఎలా మారాయో ఇక్కడ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ముఖ్యంగా నిత్యవసర వస్తువుల ధరలు భగ్గుమన్నాయి.
మరీ ముఖ్యంగా ఆయిల్ ధరలు ఆకాశాన్నంటాయి.ఇపుడెప్పుడే ఆ పరిస్థితి కాస్త మెరుగవుతూ వస్తోంది.
అయినా ఇంకా మెరుగుపడాల్సి వుంది.ఎందుకంటే నిత్యవసర ధరలు పెరగడంతో సామాన్యులకు బతకలేని పరిస్థితి వుంది.
ఈ క్రమంలో సామాన్యులకు తీపి కబురు అందనుంది.ఏకంగా రూ.
40 కే వంట నూనె పొందే అవకాశం వుంది. """/" /
ఇకపోతే, గత కొన్ని రోజుల నుంచి వంట నూనె ధరలు( Cooking Oil Prices ) కాస్త తగ్గుముఖం పడుతూ వస్తున్నాయి.
రానున్న రోజుల్లో ఈ ధరలు మరింత తగ్గే అవకాశం ఉన్నట్లు లేకపోలేదు.అయితే ఇలాంటి క్రమంలో వంటనూనెపై హిమాచల్ ప్రభుత్వం ఓ కీలక ప్రకటన చేయడం విశేషం.
అవును, వారు వంట నూనెపై సబ్సిడీ ఆఫర్ చేస్తున్నట్లు తెలుస్తోంది.రేషన్ కార్డు ( Ration Card )ఉన్నవారికి సబ్సిడీలో తక్కువ ధరకే వంటనూనెను అందివ్వనుందంట.
దాంతో గతంలో ఉన్న ధరలతో పోలిస్తే ఇప్పుడు లబ్దిదారులకు లీటరుకు రూ.37 తక్కువ ధరకు నూనె లభిస్తుందని ఆయన చెప్పడం కొసమెరుపు.
"""/" /
అంటే, లీటరుకు అక్కడ రూ.40కే వంట నూనె దొరికే పరిస్థితి ఉందని తెలుస్తోంది.
ఇదే నిజమైతే అక్కడ సామాన్యులకు ఇది పెద్ద శుభవార్తే అని చెప్పుకోవాలి.ఎందుకంటే, సగటు ఓ కుటుంబం నెలకు నాలుగు నుండి ఐదు లీటర్ల వంటనూనెని వాడడం ఇక్కడ జరుగుతుందని చెప్పుకోవచ్చు.
ఈ లెక్కన వారు దాదాపుగా నెలకు 200 నుండి 300 రూపాయిల వరకు అదా చేసే అవకాశం కలదు.