అక్కడ ఒక్కో చెట్టు నుంచి 4660 యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి

ప్రస్తుతం అంతా పర్యావరణ హిత విధానాలను అవలంబిస్తున్నారు.పెట్రోల్, డీజిల్ వాహనాల నుంచి ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయడం ప్రారంభిస్తున్నారు.

 There Is 4660 Units Of Electricity Generation From Each Tree Tree, Technology Ne-TeluguStop.com

ఇదే తరుణంలో ప్రభుత్వాలు కూడా వినూత్నంగా ఆలోచిస్తున్నాయి.గుజరాత్ రాజధాని గాంధీనగర్‌( Gandhinagar )లో సోలార్ ట్రీ( Solar tree )లు ఏర్పాటు చేస్తున్నారు.

వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం.అక్కడి పబ్లిక్ గార్డెన్‌లో విద్యుత్తును ఉత్పత్తి చేసే చెట్లను పెడుతున్నారు.

గాంధీనగర్ మునిసిపల్ కార్పొరేషన్ స్మార్ట్ సిటీ కింద ఒక ప్రత్యేకమైన చొరవ తీసుకుంది.ఈ సౌర చెట్లను ఈ చొరవ క్రింద స్థాపించారు.

మునిసిపల్ కార్పొరేషన్ యొక్క స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ జస్వాంత్ భాయ్ పటేల్ దీనిపై స్పందించారు.గ్రీన్ ఎనర్జీపై తాము దృష్టి పెడుతున్నామని, ఈ నేపథ్యంలో 20 సౌర చెట్లను బహిరంగ ప్రదేశంలో ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.

ఈ సోలార్ చెట్లు ఏడాది పొడవునా విద్యుత్తును ఉత్పత్తి చేస్తాయని అధికారులు చెబుతున్నారు.అయితే వీటి నుంచి ఉత్పత్తి అయిన విద్యుత్తను గుజరాత్ ప్రభుత్వ విద్యుత్ సంస్థకు విక్రయించనున్నారు.4660 యూనిట్ల విద్యుత్ సగటున ఒక్కో చెట్టు నుంచి రోజూ వస్తుంది.ఇలా వచ్చిన విద్యుత్ విక్రయిస్తే అక్కడ ఏర్పాటు చేసిన 20 సోలార్ ట్రీల నుంచి రూ.1.25 కోట్ల విలువైన విద్యుత్ జనరేట్ అవుతుంది.

ఈ సౌర చెట్టు యొక్క పరిమాణం చాలా పెద్దది, ఇది పెద్ద చెట్ల వలె ఉంటాయి.ఇదే తరహాలో ప్రధాని మోడీ ప్రాతినిథ్యం వహిస్తున్న యూపీలోని వారణాసిలోనూ సోలార్ ట్రీలను అక్కడ అధికారులు ఏర్పాటు చేస్తున్నారు.అక్కడి ప్రాజెక్టు ఖర్చు రూ.17.24 కోట్లు.14,400 చదరపు మీటర్లలో 3700 కంటే ఎక్కువ సౌర ఫలకాలను ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కో సోలార్ ట్రీకి 10 సౌర ఫలకాలను చొప్పున మొత్తం 40 సోలార్ ట్రీలను పెడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube