మెదడులో రహస్య సొరంగాల గురించి తెలిస్తే.. ఓరి బ్రహ్మదేవుడో.. అంటారు!

మనిషి మెదడులో సీక్రెట్ టన్నెల్స్ ఉన్నాయి.వాటిని ఎలుకలు.

 There Are Secret Tunnels Connecting Your Skull , Harvard Medical School, Massach-TeluguStop.com

మానవులలో 2018 లోనే కనుగొన్నారు.అయితే వాటి పని తీరు ఏమిటనేది ఇప్పుడు తెరపైకి వచ్చింది.

వీటిని సీక్రెట్ టన్నెల్స్ అని పిలుస్తారు.ఈ సొరంగాలు మెదడును పుర్రెతో అనుసంధానించడానికి పని చేస్తాయి.

దీనిపై బోస్టన్‌లోని మసాచుసెట్స్ జనరల్ హాస్పిటల్, హార్వర్డ్ మెడికల్ స్కూల్ సంయుక్తంగా పరిశోధనలు చేశాయి.పరిశోధనల్లో అనేక ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

మెదడులో ఉండే ఈ రహస్య సొరంగాలు చాలా రకాలుగా పనిచేస్తాయని పరిశోధకులు చెబుతున్నారు.ఉదాహరణకు.

శరీరంలోని వ్యాధులతో పోరాడే రోగనిరోధక కణాలు, ఎముక మజ్జ కణాలు శరీరంలో ప్రసరణను సాగించడానికి ఇవి దోహదపడతాయి.మెదడులో ఏ రకమైన సమస్య వచ్చినా, వీటి వల్ల ఆ ప్రత్యేక రసాయనం చేరి ఉపశమనం కలిగిస్తుంది.

మెదడులో ఈ రహస్య సొరంగాలు ఎలా కనుగొనబడ్డాయో ఇప్పుడు తెలుసుకుందాం.మెదడులోని రోగనిరోధక కణాలను న్యూట్రోఫిల్స్ అంటారు.

అయితే అవి మెదడులో ఎలా తిరుగుతాయో తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలు దానిపై పరిశోధన ప్రారంభించారు.సైన్స్ అలర్ట్ నివేదిక ప్రకారం, శరీరంలో గాయం ఏర్పడినప్పుడు ఈ న్యూట్రోఫిల్స్ మొదట యాక్టివ్ అవుతాయి.

అవి మెదడులో ఎక్కడ తిరుగుతాయో తెలుసుకోవడానికి, శాస్త్రవేత్తలు ఒక ప్రయోగం చేశారు.ఇది వాటి సర్క్యులేషన్ రూట్‌ని వెల్లడించింది.మెదడులోని ప్రత్యేక మార్గం ద్వారా ఈ కణాలు కదులుతుంటాయని పరిశోధనల్లో వెల్లడైంది.మెదడులోని ఈ రహస్య సొరంగాల పనిని తెలుసుకుంనేందుకు శాస్త్రవేత్తలు నొప్పి, వాపు, మెదడు స్ట్రోక్, మెనింజైటిస్ పరిస్థితిని సృష్టించారు.

ప్రతి పరిస్థితిలో ప్రతిసారీ ఈ రహస్య సొరంగాల ద్వారా శరీరంలో న్యూట్రోఫిల్స్ ప్రసరించడాన్ని గుర్తించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube