ఆ డాన్ ఇంటి చుట్టూ 150 కుక్కలు కాపలా ఉంటాయట... కానీ పోలీసులు ఛేదించారు!

అవును, ఆ డాన్ ని పట్టుకోవడం అంత సులువు కాదు.

అతన్ని టచ్ చేయాలంటే ఆ ఇంటి చుట్టూ వున్న దాదాపు 150 కుక్కల్ని దాటి వెళ్ళాలి.

అతని పేరు నరేంద్ర ఆర్య.అతని స్వస్థలం హరియాణా.

గోవాలో సెటిలైన బడా డ్రగ్స్‌ మాఫియా సామ్రాజ్యానికి రారాజు.గోవాలోని ఓ సంపన్న కాలనీలోని అతని నివాసం ఉంటుంది.

కుక్కలతోపాటు పోలీసులు దాడి చేయకుండా అక్కడ భారీ భద్రత కూడా ఉంటుంది.మానవ మాత్రులెవరైనా పొరపాటున ఆ ఇంట్లోకి వెళ్తే.

Advertisement

ప్రాణాలతో బయటపడడం కష్టమే.అచ్చం సినిమాలో విలన్ మాదిరి బిల్డప్ ఆ ఇంటిదగ్గర ఉంటుందంటే మీరు నమ్మితీరాలి.

అలాంటి అడ్డాపై హైదరాబాద్‌ పోలీసులు ధైర్యంగా దాడి చేసి, ఆ డ్రగ్స్‌ మాఫియా కింగ్‌పిన్‌కు బేడీలు వేశారు.దాదాపు ఓ 40 గంటల పాటు.

ఆ ఇంటి ఆవరణలో.రెక్కీ నిర్వహించి, కుక్కల వలయంలో ఉండి మరీ నిందితుడిని పట్టుకున్నారు.

ఈ క్రమంలో కొంతమంది పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయి.గోవాలో ఉన్నవాడిని మన హైదరాబాదీ పోలీసులు ఎందుకు పెట్టుకున్నారో తెలియాలంటే మీరు ఈ స్టోరీ పూర్తిగా చదవాల్సిందే.

అభిమన్యుడి మరణం శ్రీకృష్ణుడికి ముందే తెలుసా..?
వీడియో వైరల్ : శోభనం గదిలో ఆలియా, రణ్ వీర్.. ఇదే తొలిసారి అంటూ..

కొన్నాళ్లక్రితం హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌, హుమయూన్‌నగర్‌, చాదర్‌ఘాట్‌ ఠాణాల పరిధుల్లో నమోదైన మూడు డ్రగ్స్‌ కేసుల్లో హైదరాబాద్‌ నార్కొటిక్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ వింగ్‌ (హెచ్‌-న్యూ) లోతుగా చేసిన దర్యాప్తుతో.అసలు గుట్టు రట్టయింది.

Advertisement

గోవాలో డ్రగ్స్ మాఫియాకి సంబంధించిన జాడలు ఉన్నాయని గుర్తించారు.దాంతో గోవాలో దాడులు జరిపి.

ఇద్దరు కింగ్‌పిన్‌లను అరెస్టు చేయగా.మరో ముఠా నాయకుడు తప్పించుకున్నాడు.

ఈ 3 కేసుల్లో మొత్తం 6 మంది సరఫరాదారులు, 30 మంది వినియోగదారులను పోలీసులు అరెస్టు చేశారు.వారి నుంచి రూ.9లక్షలు విలువ చేసే 140 గ్రాము చరస్‌, 1450 గ్రాముల గంజాయి, 184 ఎల్‌ఎ్‌సడీ బ్లోట్స్‌, 10గ్రాముల MDMA, 7 సెల్‌ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నారు.గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హైదరాబాద్‌ పోలీసు కమిషనర్‌ సీవీ ఆనంద్‌ ఈ వివరాలు వెల్లడించారు.

జూబ్లీహిల్స్‌, హుమయూన్‌నగర్‌, చాదర్‌ఘాట్‌ పోలీ్‌సస్టేషన్ల పరిధిలో నమోదైన మూడు డ్రగ్స్‌ కేసుల్లో దర్యాప్తు ప్రారంభించిన హెచ్‌-న్యూ బృందాలు.గోవాలో మూలాలు ఉన్నట్లు కనుకొన్నాయి.

తాజా వార్తలు