రాష్ట్రంలో ఉత్కంఠ రేపుతున్న మునుగోడు ఉప ఎన్నికను అన్ని పార్టీలు సీరియస్ గా తీసుకుంటున్నాయి.అక్కడి నేతలతో సమావేశాలు పెడుతూ గెలుపు అంశాలపై ఆరా తీస్తున్నాయి.
ఏ సామాజిక వర్గం ఎక్కువగా ఉంది.ఎవరిని బరిలోకి దింపాలి.
అక్కడ వ్యతిరేకత ఉందా.పార్టీలో యాక్టీవ్ గా ఎవరు ఉంటున్నారు.
అని లెక్కలేసుకుంటున్నాయి.ఇక అధికార పార్టీ టీఆర్ఎస్ కింది స్థాయి నేతలపై ఫోకస్ పెట్టింది.
అలాగే పలు కీలక నేతలను పార్టీలో చేర్చుకుంటున్నారు.ఇక ట్విస్ట్ ఏంటంటే.
పార్టీ నుంచి సస్పెండ్ చేసిన నేతనే మళ్లీ పిలిచి మరి చేర్చుకోవడం.మునుగోడు ఉప ఎన్నిక అన్నింటిలాగే అని దానికంటూ ప్రత్యేకత ఏమీ లేదంటూ ఇటీవల మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు.
కానీ అందుకు భిన్నంగా చర్యలు ఉంటున్నాయి.ఇక సీఎం కేసీఆర్ ఈ ఉప ఎన్నిక కోసం గంటల తరబడి టైమ్ కేటాయించి గెలుపుపై విశ్లేషిస్తున్నారు.
ఏ చిన్న అవకాశాన్ని కూడా వదలకుండా.మునుగోడులో గులాబీ జెండా ఎగరేయాలన్న పట్టుదలతో ఉన్నారు.
ఇందులో భాగంగానే కీలక నేతలను పార్టీలో చేర్చుకుంటున్నారు.
సస్పెండ్ చేసిన నేతను.
.
ఎలాగైనా గెలుపొందాలని గతంలో తాను ఆగ్రహించి వేటు వేసిన నేతలు సైతం కేసీఆర్ గుర్తుకు తెచ్చుకుని అక్కున చేర్చుకుంటున్నారు.
తాజాగా గతంలో వేటు వేసిన నేతను పార్టీలోకి తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది.మునుగోడు నియోజకవర్గం పరిధిలో వేనేపల్లి వెంకటేశ్వరరావు సీనియర్ నేతగా ఉన్నారు.
స్థానికంగా మంచి పట్టున్న ఆయన మొదట్నించి టీడీపీలో ఉండేవారు.అయితే.
ఉద్యమం ఉదృతంగా సాగుతున్న వేళ సైకిల్ దిగి గులాబీ కారు ఎక్కేశారు.అప్పటి నుంచి పార్టీ కోసం తీవ్రంగా పని చేసేవారు.2004లో మునుగోడు బరిలో దిగిన టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి విజయంలో కీలక పాత్ర పోషించారు.అయితే 2018 వచ్చేసరికి మాత్రం మునుగోడు టికెట్ తనకు కన్ఫర్మ్ చేయాలన్న ప్రయత్నాలు మొదలుపెట్టారు.దీంఓ ఆయనకు ఆ అవకాశాన్ని కేసీఆర్ ఇవ్వలేదు.2018లోనూ మునుగోడు పార్టీ టికెట్ ను కూసుకుంట్లకే కేటాయించటంతో ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.భారీ బహిరంగ సభను నిర్వహించి తన బలాన్ని చాటుకున్నారు.
దీంతో ఆగ్రహానికి గురైన కేసీఆర్ పార్టీ లైన్ కు భిన్నంగా సభ పెడతారా.? అంటూ సస్పెండ్ చేశారు.అప్పటి నుంచి టీఆర్ఎస్ కు ఆయన దూరంగా ఉంటున్నారు.
ఇక తాజాగా ఉప ఎన్నిక అనివార్యమైన నేపథ్యంలో వేనేపల్లికి ప్రగతిభవన్ నుంచి పిలుపు వచ్చింది.ఇక ప్రగతిభవన్ కు వెళ్లిన ఆయనతో మాట్లాడిన సీఎం కేసీఆర్ ఆయన్ను తిరిగి పార్టీలో చేర్చుకుంటున్నట్లుగా ప్రకటించారు.
గతంలో ఆయన మీద విధించిన సస్పెన్షన్ ను ఎత్తేయటమే కాకుండా పార్టీలో సముచిత స్థానం ఇస్తామని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.దీంతో కేసీఆర్ ఉప ఎన్నికను ఎంత సీరియస్ గా తీసుకుంటున్నారో అర్థం చేసుకోవచ్చని అంటున్నారు.