సూపర్ స్టార్ మహేష్ ఇంట్లో దొంగలు.. కట్ చేస్తే సీన్ మొత్తం రివర్స్!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం శోకసంద్రంలో ఉన్నారు.తన తల్లి ఇందిరా మృతి చెందడంతో మహేష్ బాబు ఎంతో బాధలో ఉండగా ఇదే అదునుగా భావించిన ఓ దొంగ ఏకంగా మహేష్ బాబు ఇంటికి కన్నం వేయడానికి ప్రయత్నాలు చేశారు.

 Thefts Robbery Attempt At Mahesh Babu Home Details, Robbers ,superstar Mahesh's-TeluguStop.com

మహేష్ బాబు ప్రస్తుతం తన ఫ్యామిలీతో కలిసి జూబ్లిహిల్స్ లోని ప్రశాసన్ నగర్‌లో ఓ లావిష్ లో ఉన్న ఇంటిలో నివసిస్తున్నారు.అప్పుడప్పుడు మహేష్ బాబు తన తల్లిని చూడడం కోసం వారి ఇంటికి వెళ్లేవారు.

గత మూడు రోజులుగా మహేష్ బాబు తల్లి అనారోగ్యం పరిస్థితులు విషమించడంతో మహేష్ బాబు కుటుంబ సభ్యులు మొత్తం అక్కడే నివసిస్తున్నారు.ఇకపోతే ఈమె బుధవారం తీవ్ర అనారోగ్య సమస్యల కారణంగా మృతి చెందారు.

మహేష్ బాబు తన తల్లి కర్మకాండలు పూర్తి అయ్యేవరకు తిరిగి తన ఇంటికి రారు.ఈ విషయాన్ని గమనించిన ఓ దొంగ ఏకంగా తన ఇంటిని దోచేయడానికి ప్రయత్నం చేశారు.

Telugu Indira Devi, Jubilee Hills, Krihna, Mahesh Babu, Prashasan Nagar, Robbers

ఒడిశాకు చెందిన కృష్ణ అనే ఒక దొంగ మహేష్ బాబు ఇంటి గోడ దూకి లోపలికి ప్రవేశించాలని ప్రయత్నం చేశారు అయితే గోడ దూకిన వెంటనే చెట్లలో పడటం వల్ల ఆయన కాళ్లు విరిగాయి ఇది గమనించిన సెక్యూరిటీ తనని హాస్పిటల్లో చేర్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఇలా దొంగతనానికి వచ్చిన ఆ దొంగకు టైం బ్యాడ్ కావడంతో అడ్డంగా దొరికిపోయి ఆస్పత్రి పాలయ్యాడు.ఇక మహేష్ బాబు సినిమాల విషయానికొస్తే ఈ రాత్రి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న సినిమాతో బిజీ అయ్యారు.అయితే తన తల్లి మరణించడంతో కొద్దిరోజులపాటు మహేష్ బాబు తన సినిమాకి బ్రేక్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube