బీజేపీ హవా తగ్గినట్లుంది?

హుజూర్‌ నగర్‌ ఎన్నికలతో పాటు మహారాష్ట్ర మరియు హార్యనాలో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన విషయం తెల్సిందే.ఈ రెండు రాష్ట్రాల్లో కూడా బీజేపీ అధికారంలో ఉంది.

 Thebjpdownin Maharastra And Hariyanaassemblyelections-TeluguStop.com

ఈ రెండు రాష్ట్రాలను మళ్లీ బీజేపీ కైవసం చేసుకుంటుందని అంతా అనుకున్నారు.అనుకున్నట్లుగానే బీజేపీ ఈ రెండు రాష్ట్రాల్లో అధికారంలోకి రావడం కన్ఫర్మ్‌.

కాని ఇక్కడ చూసినట్లయితే ఈ రెండు రాష్ట్రాల్లో కూడా బీజేపీకి సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసే బలం రాలేదు.గతంలో రెండు రాష్ట్రాల్లో కూడా సొంతంగా ప్రభుత్వంను ఏర్పాటు చేసిన బీజేపీ ఈసారి మాత్రం మిత్ర పక్షాలు లేదా ఇతరులతో కలిసి ప్రభుత్వంను ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి.

కేవలం నాలుగు నెలల క్రితం దేశ వ్యాప్తంగా అద్బుతమైన మెజార్టీతో గెలుపొంది బీజేపీ కేంద్రంలో ప్రభుత్వంను ఏర్పాటు చేసింది.ఇంత తక్కువ సమయంలో వచ్చిన మహారాష్ట్ర ఎన్నికల్లో మాత్రం కాస్త హవా తగ్గినట్లుగా అనిపిస్తున్న నేపథ్యంలో ఆ పార్టీ నాయకులు కాస్త ఆలోచించాల్సిన అవసరం ఉంది.

త్వరలో ఉత్తర ప్రదేశ్‌ ఎన్నికలు జరుగనున్నాయి.ఆ ఎన్నికల్లో కూడా ఇలాంటి ఫలితాలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి.ముందస్తుగానే బీజేపీ ఈ విషయాన్ని గుర్తిస్తుందా అనేది చూడాలి.మహారాష్ట్రలో బీజేపీ 103 స్థానాలు సొంతం చేసుకోగా మిత్రపక్షం అయిన శివసేన 56 దక్కించుకుంది.

ఇక హర్యానాలో బీజేపీ 40 సీట్లు దక్కించుకుంది.మరో ఆరు సీట్లు ఇతరుల నుండి తీసుకుని బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube