బైక్ సతాయిస్తోందని బైక్ ను పెట్రోల్ పోసి నిప్పంటించిన యువకుడు

కొత్తగా కొన్న బైక్ ( Bike )సతాయిస్తోందని ఓ యువకుడు బైక్ ను పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటన శ్రీసత్యసాయి జిల్లాలో చోటుచేసుకుంది హిందూపురం మండలం ఎం బీరేపల్లి( Birepalli )కి చెందిన యువకుడు మనోజ్ హిందూపురం పట్టణంలో టీవీఎస్ షోరూం( TVS Showroom )లో ఐదు నెలల క్రితం ఒక ద్విచక్ర వాహనం కొనుగోలు చేశాడు.

 The Young Man Poured Petrol On The Bike And Set It On Fire , Young Man , Fire-TeluguStop.com

అయితే ఆ ద్విచక్ర వాహనానికి ఇటీవల కాలంలో మరమతులు ఎక్కువగా వస్తుండటంతో తన ద్విచక్ర వాహనాన్ని మార్చి ఇవ్వాలని కోరాడు.

అందుకు షో రూమ్ డీలర్ ఒప్పుకోకపోయేసరికి గొడవపడి షోరూమ్ ముందు తన ద్విచక్ర వాహనానికి పెట్రోల్ పోసి నిప్పంటించి అక్కడినుండి వెళ్ళిపోయాడు.ద్విచక్ర వాహనం దగ్ధమవుతుండడంతో చుట్టుపక్కల ప్రాంతాల వారు గుమికూడి ఏం జరిగిందో తెలియక వీక్షించారు.

షోరూం డీలర్ వన్ టౌన్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube