బైక్ సతాయిస్తోందని బైక్ ను పెట్రోల్ పోసి నిప్పంటించిన యువకుడు

కొత్తగా కొన్న బైక్ ( Bike )సతాయిస్తోందని ఓ యువకుడు బైక్ ను పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటన శ్రీసత్యసాయి జిల్లాలో చోటుచేసుకుంది హిందూపురం మండలం ఎం బీరేపల్లి( Birepalli )కి చెందిన యువకుడు మనోజ్ హిందూపురం పట్టణంలో టీవీఎస్ షోరూం( TVS Showroom )లో ఐదు నెలల క్రితం ఒక ద్విచక్ర వాహనం కొనుగోలు చేశాడు.

అయితే ఆ ద్విచక్ర వాహనానికి ఇటీవల కాలంలో మరమతులు ఎక్కువగా వస్తుండటంతో తన ద్విచక్ర వాహనాన్ని మార్చి ఇవ్వాలని కోరాడు.

అందుకు షో రూమ్ డీలర్ ఒప్పుకోకపోయేసరికి గొడవపడి షోరూమ్ ముందు తన ద్విచక్ర వాహనానికి పెట్రోల్ పోసి నిప్పంటించి అక్కడినుండి వెళ్ళిపోయాడు.

ద్విచక్ర వాహనం దగ్ధమవుతుండడంతో చుట్టుపక్కల ప్రాంతాల వారు గుమికూడి ఏం జరిగిందో తెలియక వీక్షించారు.

షోరూం డీలర్ వన్ టౌన్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు.

పవర్ స్టార్ పవన్ అలాంటి వ్యక్తి.. వైరల్ అవుతున్న శ్రియారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!