తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలు క్రియేట్ చేసిన రికార్డులన్నీ బ్రేక్ చేస్తూ యంగ్ హీరోలు తమదైన రీతిలో ముందుకు దూసుకెళ్తున్నారు.ఇక ఇప్పటికే వాళ్ళు చేసిన సినిమాలతో చాలామంది స్టార్ హీరోల రికార్డులను బ్రేక్ చేశారు.
ఇక ఇప్పుడున్న యంగ్ హీరోల్లో తేజ సజ్జా( Teja Sajja ) హనుమాన్ సినిమాతో ఒక భారీ సక్సెస్ ను అందుకున్నాడు.ఇక ఈ సినిమాతో 400 కోట్ల వరకు కలెక్షన్లను రాబట్టాడు.
అంటే దాదాపు సీనియర్ హీరోల రికార్డులన్ని బ్రేక్ చేసినట్టుగా తెలుస్తుంది.ఇక దీంతో పాటుగా రీసెంట్ గా సిద్దు జొన్నలగడ్డ ( Siddu Jonnalagadda )హీరోగా వచ్చిన డిజే టిల్లు స్క్వేర్( Tillu Square ) సినిమాతో ఆయన మంచి విజయాన్ని సాధించాడు.ఈయన ఏకంగా మహేష్ బాబు రికార్డును కూడా తిరగరాసాడు.మహేష్ బాబు హీరోగా వచ్చిన గుంటూరు కారం సినిమా అమెరికా లో 2.63 మిలియన్ డాలర్స్ ని వసూలు చేస్తే, సిద్దు హీరోగా చేసిన డీజే టిల్లు స్క్వేర్ సినిమా మాత్రం 2.69 మిలియన్ డాలర్స్ ని వసూలు చేసింది.ఇక లాంగ్ రన్ లో ఈ సినిమా మూడు మిలియన్లకు పైన డాలర్లను వసూలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయంటు ట్రేడ్ పండితులు చెబుతున్నారు…ఇలా యంగ్ హీరోలు అందరూ కూడా మంచి ఫామ్ లో ఉండి వరుస సినిమాలు చేసుకుంటూ ముందుకు రావడం అనేది ఒక రకంగా మంచి విషయమనే చెప్పాలి.
అయితే ఈ సినిమాలతో తమను తాను ప్రూవ్ చేసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు.ఇక ఇలాంటి క్రమం లోనే వాళ్ళు చేసిన వరుస సినిమాలు కూడా సూపర్ డూపర్ సక్సెస్ లను సాధిస్తూ ముందుకు దూసుకెళుతున్నాయి.ఇక ముందు ఈ యంగ్ హీరోలు ఇంకెన్ని రికార్డ్ లను బ్రేక్ చేస్తారో చూడాలి.