ప్రపంచంలోనే అరుదైన బ్లడ్ గ్రూప్ భారత్‌లో గుర్తింపు.. ప్రత్యేకత ఏంటంటే

మనుషులు అందరిలోనూ రక్తం ఎరుపు రంగులోనే ఉంటుంది.రక్తం ఒకే రంగులోనూ ఉన్నా, సాధారణంగా ఎనిమిది బ్లడ్ గ్రూపులు ఉంటాయి.

 The World S Rarest Blood Group Is Recognized In India What Is Special About It-TeluguStop.com

ఏ +, ఏ-, బీ +, బీ -, ఏబీ +, ఏబీ -, ఓ+, ఓ – ఇలా గ్రూపులను మనుషులలో గుర్తిస్తుంటారు.అయితే ప్రతి గ్రూపులోనూ ఎన్నో వివిధ రకాల గ్రూపులు ఉన్నాయి.

అందరికీ ఓ గ్రూపు రక్తం ఎక్కించ వచ్చు.ముఖ్యంగా ఓ నెగటివ్ గ్రూపు అందరికీ సరిపోతుంది.

ఎవరికైనా ఈ గ్రూపు రక్తాన్ని ఎక్కించ వచ్చు.ప్రతి గ్రూపులోనూ ఉండే అంతర్గత వేరే గ్రూపులు వందల సంఖ్యలో ఉంటాయి.

ఈ తరుణంలో భారత్‌లో ఓ అరుదైన బ్లడ్ గ్రూపును శాస్త్రవేత్తలు గుర్తించారు.దీనికి సంబంధించిన ఆసక్తికర విషయాలిలా ఉన్నాయి.

గుజరాత్ రాష్ట్రం రాజ్‌కోట్ ప్రాంతంలో ఓ అరుదైన బ్లడ్ గ్రూప్ బయటపడింది.అది ప్రపంచంలో కేవలం పది మందికి మాత్రమే ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సాధారణంగా రక్తంలో గ్రూపు యాంటీజెన్, యాంటీబాడీల ఆధారంగా గుర్తిస్తారు.ఈ తరుణంలో ఏ, ఓ, బీ, ఏబీ గ్రూపులలో 42 రకాల వేర్వేరు వ్యవస్థలు కనిపిస్తాయి.

ఇటీవల బయట పడిన ప్రత్యేకమైన రక్తగ్రూపును ఈఎంఐ నెగటివ్ గ్రూపుగా శాస్త్రవేత్తలు నిర్ధారించారు.మామూలుగా రక్తంలో ఈఎంఐ ఉంటుంది.

అయితే అతడికి గుండెకు సంబంధించిన శస్త్రచికిత్స చేసే సమయంలో రక్తం పరీక్ష చేసినప్పుడు ఈఎంఐ లేదని గుర్తించారు.ఈ వ్యక్తికి ఉన్న రక్త గ్రూపు ప్రకారం ఇలాంటి వ్యక్తులు ఇతరులకు రక్తం ఎక్కించలేరు.

ఎవరి రక్తం వీరు స్వీకరించలేరు.దీంతో ఈ అరుదైన రక్త గ్రూపు బయటపడింది.

ఇలాంటి వ్యక్తులకు ఏదైనా ప్రమాదం ఏర్పడితే ప్రాణాలు కోల్పోయే అవకాశం కూడా ఉంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube