వేసవికాలంలో స్విమ్మింగ్ పూల్ లో సేదతీరడం అంటే ప్రతి ఒక్కరికి సరదానే.ఇక ఫైవ్ స్టార్ హోటల్స్, పెద్దపెద్ద అపార్ట్మెంట్స్ లో స్విమ్మింగ్ పూల్స్ ఉంటాయి.
అయితే ప్రపంచంలో కొన్ని చోట్ల ఉన్న స్విమ్మింగ్ పూల్ ఆసక్తికరంగా హాట్ టాపిక్ గా మారుతాయి.ఇప్పుడు అలాంటి ఈతకొలను ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇక ఈ స్విమ్మింగ్ పూల్ భూమికి అత్యంత ఎత్తులో 55 అంతస్తు మీద ఉంటుంది.ఇక స్విమ్మింగ్ పూల్ కూడా చాలా పారదర్శకంగా ఉంటుంది.
అది కూడా 360 డిగ్రీల ఇన్ఫినిటీ.
సోషల్ మీడియా లో వైరల్ అవుతున్న ఈ స్విమ్మింగ్ పూల్ సుమారు 6 లక్షల లీటర్ల నీటిని కలిగి ఉంటుంది.
అయితే నిజానికి స్విమ్మింగ్ పూల్ ఇంకా నిర్మాణం కాలేదు.ప్రస్తుతం ఇది కేవలం గ్రాఫిక్స్ కి మాత్రమే పరిమితమైంది.అయితే ఈ స్విమ్మింగ్ పూల్ త్వరలో నిర్మించడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.అది కూడా ఈ స్విమ్మింగ్ పూల్ భారీ వ్యయంతో నిర్మించనున్నారు.
ప్రపంచంలో అత్యంత ఎత్తైన స్విమ్మింగ్ పూల్ గా, అత్యంత ఖరీదైన సింపుల్గా ఇది ఉండబోతుంది అని తెలుస్తుంది.







