ప్రపంచంలోనే అతిపెద్ద, ఎక్కువ మంది అభిమానించేటువంటి టాయ్ స్టోర్ “టాయ్స్ ఆర్ అజ్”ను భారతదేశంలోని వినియోగదారుల కోసం హైద్రాబాదు, హైటెక్ సిటీ సమీపంలోని శరత్ సిటీ క్యాపిటల్ మాల్ (Sharat City Capital Mall)వద్ద తాజాగా ప్రారంభించారు.ఈ నూతన స్టోర్‌లో ప్రపంచశ్రేణి బ్రాండెడ్ బొమ్మలు లభ్యమౌతాయి.
ఇక్కడ చిన్నారుల కోసం అనేకరకాల బొమ్మలు కొలువుదీరి ఉంటాయి.ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది చిన్నారులకు టాయ్స్ ఆర్ అజ్ అనేది ఫెవరెట్ స్పాట్ అని తెలుస్తోంది.
ఇక నేడు అది మన తెలుగువారికి కూడా ఫెవరెట్ కావడం తధ్యం అని నిర్వాహకులు చెబుతున్నారు.

దాదాపు 7 దశాబ్దాలుగా అత్యున్నత నాణ్యత కలిగిన బొమ్మల కలెక్షన్‌ను ఈ షోరూమ్ పిల్లలకు అందిస్తుంది.ఇక్కడ బార్బీ, లెగో, హాట్ వీల్స్, నెర్ఫ్ లాంటి బ్రాండ్ల బొమ్మలతో పాటుగా డిస్నీ, పారామౌంట్ నుంచి వచ్చిన లైసెన్స్‌డ్ టాయ్స్ కూడా లభ్యమవుతాయి.ఏస్ టర్టెల్ సీఈఓ నితిన్ చాబ్రా(CEO Nitin Chhabra) ఈ స్టోర్ ప్రారంభం గురించి మాట్లాడుతూ… ప్రపంచ ప్రఖ్యాతగాంచిన ఈ షోరూమ్ ని మన హైదరాబాద్‌లోనే ప్రారంభించడం చాలా ఆనందించాల్సిన విషయం అని అన్నారు.
ప్రభుత్వ మద్దతుతో భారతదేశంలో బొమ్మల పరిశ్రమ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతుంది అని అన్నారు.

ఇది ప్రభుత్వ మేక్ ఇన్ ఇండియా(Make in India) కార్యక్రమాన్ని మరింత విస్తృత పరచడంతో పాటుగా దేశంలో బొమ్మల తయారీని మరింత వేగవంతం చేయగలడు అని కూడా అన్నారు.ఇన్వెస్ట్ ఇండియా లెక్కల ప్రకారం భారతదేశంలో బొమ్మల పరిశ్రమ 1.5 బిలియన్ డాలర్ల విలువ కలిగి ఉంటుందని ఓ అంచనా.అయితే భారతదేశంలో బొమ్మల పరిశ్రమ 2024 నాటికి 2 బిలియన్ డాలర్లకు పైగా వృద్ధి చెందనున్నట్లు అంచనా.అయితే భారతీయ బొమ్మల పరిశ్రమ అంతర్జాతీయ బొమ్మల పరిశ్రమలో కేవలం 0.5% మాత్రమే ఉంది.తద్వారా ఇక్కడ భారీ వృద్ధి అవకాశాలు ఉన్నాయి.







