సాహితి ఫార్మా కంపెనీ గేటు ముందు ఆందోళనకు దిగిన కార్మికులు..!!

ఈరోజు ఉదయం అచ్యుతాపురంలో ఉన్న సాహితీ ఫార్మా కంపెనీ( Sahiti Pharma Company )లో అగ్నిప్రమాదం సంభవించడం తెలిసిందే.ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించగా ఐదుగురు తీవ్ర గాయాలు పాలయ్యారు.

 The Workers Protested In Front Of The Gate Of Atchutapuram Sez Pharma Company, S-TeluguStop.com

గాయాలైన వారికి కేజీహెచ్ లో చికిత్స అందిస్తున్నారు.పరిస్థితి ఇలా ఉంటే కంపెనీ గేటు ముందు కార్మికులు నిరసన( Workers Protest )కు దిగారు.

పరిశ్రమ యాజమాన్య వైఖరికి నిరసనగా నినాదాలు చేస్తున్నారు.వరుస ప్రమాదాలను అరికట్టాలని… ఇందుకోసం ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.

సరిగ్గా ప్రమాదం జరిగిన సమయంలో ఫార్మా కంపెనీలో మొత్తం 35 మంది కార్మికులు విధుల్లో ఉన్నారు.మంటలు చూచి 28 మంది కార్మికులు బయటకు వచ్చేసారని ఎస్పీ తెలియజేయడం జరిగింది.

అచ్యుతాపురం సేజ్( Atchutapuram SEZ Pharma Company ) లోని ఫార్మా కంపెనీలో శుక్రవారం ఉదయం భారీ పేలుడు సంభవించింది.రియాక్టర్ పేలడంతో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి.

భారీ శబ్దంతో పేలుడు సంభవించడంతో తీవ్రభయాందోళనకు గురైన స్థానికులు అక్కడ నుంచి పరుగులు తీశారు.మొత్తం ఈ ప్రమాదంలో ఏడుగురు గాయపడ్డారు.

ఇద్దరు మరణించడం జరిగింది.గాయపడిన క్షతగాత్రులకు విశాఖ కేజీహెచ్ లో చికిత్స అందిస్తున్నారు.

కంపెనీ నిర్లక్ష్య వైఖరి కారణంగానే ప్రమాదం సంభవించినట్లు కార్మికులు కంపెనీ గేటు ముందు ఆందోళనకు దిగటం జరిగింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube