పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి.ఈ మేరకు ఇవాళ ప్రారంభం కానున్న ఈ సమావేశాలు డిసెంబర్ 22 వరకు కొనసాగనున్నాయి.
19 రోజుల పాటు కొనసాగే ఈ సెషన్ లో మొత్తం 15 సమావేశాలు జరగనున్నాయి.ఈ సమావేశాల్లో కేంద్రం పలు కీలక బిల్లులను ప్రవేశపెట్టనుంది.
అలాగే క్వాష్ ఫర్ క్వెరీ కేసులో టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రాకు సంబంధించి ఎథిక్స్ కమిటీ నివేదిక సమర్పించే అవకాశం ఉంది.ఈ నివేదికలో మహువాను సస్పెండ్ చేయాలని కమిటీ సిఫార్సు చేసింది.
ఒకవేళ ఈ నివేదికకు లోక్ సభ ఆమోదం తెలిపితే మొయిత్రా పార్లమెంట్ సభ్యత్వం ముగుస్తుంది.
పార్లమెంట్ శీతాకాల సమావేశాల ప్రారంభం సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ ప్రజల తీర్పు తరువాత పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయన్నారు.
మరోసారి ప్రజలు అద్భుతమైన తీర్పు ఇచ్చారని పేర్కొన్నారు.కొత్త పార్లమెంట్ లో ఫలవంతమైన చర్చ జరగాలని కోరుకుంటున్నానని తెలిపారు.







