ప్రపంచంలో యుద్ధాలు జరుగుతూ ఉండడం సహజమే.అయితే ఈ యుద్ధ భాగంలో ఎంతోమంది ప్రాణాలు కోల్పోతారు.
అయినప్పటికీ కూడా యుద్ధం చేయడం వాళ్ళ ధర్మం అంటూ చాలామంది ప్రాణాలను ఫణంగా పెట్టి యుద్ధం చేస్తుంటారు.తమ దేశం కోసం యుద్ధం చేస్తూ ఉంటారు.
అయితే యుద్ధాలు బయట మాత్రమే కాకుండా సముద్రాల్లో కూడా జరుగుతాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే.
సముద్రాల్లో చాలా యుద్ధ నౌకలు తమ దేశాన్ని కాపాడుకోవడం కోసం గస్తీ కాస్తుంటాయి.
అయితే అలాంటి ఓ దేశ నౌక మునిగిపోయింది.ఆ ఘటనలో చాలామంది గల్లంతయ్యారు.
అయితే అందులో అక్కడి సహాయక చర్యలు 75 మందిని కాపాడారు.అయితే మరో 31 మంది మాత్రం గల్లంతయ్యారు.
ఇక వాళ్లను సముద్రంలో ఇంకా గాలిస్తున్నారు.అయితే వీళ్ళ కోసం థాయిలాండ్ నావికాదళ హెలికాప్టర్లు, నౌకల్లో సైన్యం అన్వేషణ పనుల్లో నిమగ్నం అయింది.
అయితే ప్రచుయాప్ ఖిరి ఖాన్ ప్రావిన్స్ లోని బాంగ్ సఫాన్ జిల్లాలో నీ ఓ సముద్ర తీరం నుంచి 32 కిలోమీటర్ల దూరంలో ఉన్న సముద్ర జలాల్లో హెచ్ టీ ఎం ఎస్ సుఖోథాయ్ యుద్ధనౌక గస్తీ కాస్తుంది.అయితే ఆ ప్రాంతంలో వేటకొచ్చే చేపల పడవల సిబ్బందికి అత్యవసరమైన పరిస్థితుల్లో ఈ నౌకా సహాయ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండేది.
అయితే ఆదివారం రాత్రి భారీ అలలు నౌకను అతలాకుతలం చేశాయి.ఆ భారీ అలలు నౌకను ఎత్తిపడేశాయి.

దీంతో నౌకలో చాలా సముద్ర నీరు వచ్చి చేరడంతో నౌకలో విద్యుత్ వ్యవస్థ స్తంభించింది.అయితే నౌకను నావికులు మాత్రం అదుపు చేయలేకపోయారు.వాళ్లు నౌకను అదుపు చేయడం లో విఫలమయ్యారు.దీంతో ఒక నౌక పక్కకు ఒరగడం మొదలై నౌక పూర్తిగా మునిగిపోయింది.అయితే మునిగిన తర్వాత సహాయక చర్యలు 75 మందిని కాపాడగా మిగతా 30 వాళ్ళు గల్లంతయ్యారు.ప్రస్తుతం అక్కడి సహాయక చర్యలు వాళ్ళను గాలిస్తున్నారు.







