సాధారణంగా హీరోలు వాడే వస్తువులు చాలా ఖరీదైనవిగా ఉంటాయి అన్న విషయం తెలిసిందే.వాళ్లు వాడే షూస్ నుంచి కార్ల వరకు ప్రతి ఒక్కటి కూడా లక్షలు కోట్లలో ఉంటాయి.
అయితే ఈ మధ్యకాలంలో స్టైలిష్ ని మైంటైన్ చేయడంలో బాలీవుడ్ హీరోస్ ని మించి పోతున్నారు మన టాలీవుడ్ హీరోస్.ఇదివరకు బాలీవుడ్ హీరోస్ ఈ విషయంలో ముందుండగా వారిని వెనక్కి నెట్టేసి టాలీవుడ్ హీరోలు స్టైలిష్ లుక్ లో ఖరీదైన వస్తువులను ధరించి వార్తలు నిలుస్తూ ఉన్నారు.
ఇక టాలీవుడ్ లో ఫుల్ స్టైలిష్ లు కనిపించే వారిలో రామ్ చరణ్ కూడా ఒకరు.ప్రస్తుతం సోషల్ మీడియాలో రామ్ చరణ్ వాడే బ్రాండెడ్ వస్తువుల గురించి వాటి ధరల గురించి జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి.
రామ్ చరణ్ వాడే వాచ్ తోపాటు షూస్ కూడా నెట్ ఇంట్లో హార్ట్ టాపిక్ గా నిలుస్తున్నాయి.కాగా వాటి ధరలు తెలిసి చాలామంది నోరెళ్ళ బెడుతున్నారు.
ఇకపోతే రామ్ చరణ్ వాడే వాచ్ కంపెనీ పేరు రిచర్డ్ మిల్లే.దీని ధర అక్షరాల మూడు కోట్ల 34 లక్షల వరకు ఉంటుందని వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.

అలాగే రామ్ చరణ్ వాడుతున్న నైక్ కంపెనీ షూస్ కూడా అక్షరాల మూడు లక్షల 60 వేల రూపాయలు అని తెలుస్తోంది.కాగా రామ్ చరణ్ వాడే ఆ బ్రాండెడ్ వస్తువుల ధరలు తెలిసి చాలామంది షాక్ అవుతున్నారు.ఇంకొందరు అయితే హీరోస్ ఉపయోగించే వస్తువులతో మధ్యతరగతి వాళ్ళు ఎంతోమంది బతకచ్చు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.కేవలం షూస్ వాచ్లు మాత్రమే కాకుండా డ్రెస్, కార్స్, బైక్స్ ఇలా ప్రతి ఒక్కటి కూడా ఖరీదైనవి ఉపయోగిస్తున్నారు రామ్ చరణ్.
ఈ క్రమంలోనే తాజాగా చెర్రీ ధరించిన వాచ్ అండ్ షూస్ గురించి వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.








