Niharika : కోట్ల కొద్దీ ఖర్చు..ఏడాది తిరక్కుండా విడాకులు..మరి ఆ ఖర్చు మాటేమిటి ?

నిహారిక విడాకుల( Niharika ) వ్యవహారం ప్రస్తుతం సోషల్ మీడియా ట్రేండింగ్ టాపిక్.సినిమా ఇండస్ట్రీ లో పెళ్లిళ్లు, ప్రేమలు, విడాకులు చాల కామన్.

 The Tollywood Couples Wasting Money On Weddings-TeluguStop.com

అందులో మెగా ఫ్యామిలీ అంటే ఇలాంటి వాటికి చాల ఫెమస్.ఇక మెగా ప్రిన్సెస్ గా నాగబాబు కుటుంబానికి వారసురాలుగా పుట్టిన నిహారిక సైతం ఈ పెళ్లి ప్రేమ విడాకుల వ్యవహారంలో ఏమాత్రం వెనక్కి తగ్గలేదు.

ఆమె చైతన్య( Chaitanya Jv ) అనే ఒక పోలీసు ఆఫీసర్ కుమారుని చాలా రోజులపాటు డేటింగ్ చేసి ఆ తర్వాత ప్రేమించి 2020లో ఉదయపూర్ ప్యాలస్ లో కోట్ల రూపాయల ఖర్చు పెట్టి ఘనంగా పెళ్లి చేసుకుంది.ఈ పెళ్లి ఎంత అందంగా వైభవంగా జరిగిందో మీడియాలో మనం అందరం చూసాం పెళ్లికి ఎంతోమంది సెలబ్రిటీలు హాజరయ్యారు.

Telugu Naga Babu, Niharika, Tollywood, Varun Tej-Movie

ఇప్పుడు కథ పూర్తిగా అడ్డం తిరిగింది.చాలా రోజులుగా నిహారిక చైతన్య విడాకులు తీసుకోబోతున్నారు అంటూ సోషల్ మీడియా( Social media )లో వార్తలు వస్తున్నా అది నిజమా కాదా అనే క్లారిటీ ఎవరు ఇవ్వలేదు.అటు నిహారిక ఇటు చైతన్య కూడా ఈ విషయంలో నిశ్శబ్దంగానే ఉన్నారు.అయితే అందరూ అన్ని రూమర్స్ లో భాగంగానే ఈ రూమర్ కూడా వచ్చి ఉంటుందని అనుకున్నారు.

మొన్న ఆ మధ్య జరిగిన వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి నిశ్చితార్థంలో కూడా చైతన్య ఎక్కడా కనిపించకపోయేసరికి ఈ రూమర్స్ కి బలం చేకూరింది.

Telugu Naga Babu, Niharika, Tollywood, Varun Tej-Movie

చివరికి నిహారిక చైతన్యతో అడ్జస్ట్ అవ్వలేకపోయింది.విడాకులు కూడా మంజూరు అవ్వడంతో నిన్న మీడియాలో పూర్తిగా ఇదే వార్త కనిపించింది.అయితే కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి ప్రీ వెడ్డింగ్ షూట్స్, నిశ్చితార్థం, పెళ్లి ఎంతో అంగరంగ వైభవంగా చేసుకున్నారు.

మరి విడాకుల తర్వాత ఆ ఖర్చులు చూస్తే తీరా తడిసి మోపడుతుంది.ఈ మాత్రం దానికి పెళ్లి ఖర్చులు ప్యాలెస్ అంటూ వృధా దండగ ఖర్చు తప్ప ఏ లాభం లేదు.

ఈ డబ్బు ఇలా వృధా ఖర్చు చేసే బదులు పేదవారికి సహాయం చేయొచ్చు కదా లేదా సినిమా ఇండస్ట్రీలోనే ఎంతోమంది డబ్బు లేక, సినిమాల్లో అవకాశాలు లేక, వయసు మీద పడి కష్టాలను పడుతున్నారు వారికైనా ఈ డబ్బు ఇస్తే ఎంతో కొంత ఉపయోగం ఉంటుంది కదా అని సామాన్య ప్రజలు కోరుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube