రూ.2 లక్షల సెల్ ఫోన్ చోరీ కేసులో దొంగను పట్టించిన చెప్పులు..!

ఓ దొంగ రైలులో రూ.2 లక్షల మొబైల్ ఫోన్ దొంగలించి, కాలికి వేసుకున్న చెప్పులతో అడ్డంగా దొరికిపోయాడు.

దొంగ నడక తీరు, వేసుకున్న చెప్పులు సీసీ టీవీ కెమెరాలలో రికార్డ్ అవడంతో పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి దొంగను పట్టుకున్నారు.

ఈ ఘటన ముంబై రైల్వేస్టేషన్లో( Mumbai Railway Station ) చోటుచేసుకుంది.అసలు ఆ దొంగ ఎలా పట్టుబడ్డాడో చూద్దాం.పోలీసులు( Police ) తెలిపిన వివరాల ప్రకారం.

సెంట్రల్ రైల్వేలో ఉద్యోగం చేస్తున్న ఓ మహిళ మే 24న లేడీస్ ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్లో కూర్చొని ప్రయాణించింది.తర్వాత ఆమె సీఎస్ఎంటీ స్టేషన్లో దిగుతున్న సమయంలో ఆమె మొబైల్ ఫోన్ కనిపించలేదు.

వెంటనే తాను కూర్చున్న సీట్ వద్దకు వెళ్లి వెతికిన కూడా ఫోన్ కనిపించలేదు.

Advertisement

దీంతో ఆ మహిళ మే 25న సీఎస్ఎంటీ జీఆర్పీ సిబ్బందికి మొబైల్ ఫోన్ పోయిందని ఫిర్యాదు చేసింది.మొదట జీఆర్పీ సిబ్బందికి ఆ మహిళ మొబైల్ ఫోన్ దొంగతనం జరిగిందా లేదంటే పోగొట్టుకుందా అనే విషయం అర్థం కాలేదు.తర్వాత సిబ్బంది సీసీటీవీ కెమెరాలను పరిశీలించిన కూడా ఫలితం లేకుండా పోయింది.

ఈ క్రమంలో ఒక వ్యక్తిపై అనుమానం ఉన్న అతడు ఎక్కడికో ప్రయాణిస్తున్నట్లు అనిపించింది.పోలీసులు కాస్త చాకచక్యంగా ఆలోచించి దర్యాప్తు ప్రారంభించారు.మహిళ ప్రయాణించిన రైలు ఉదయం 11:35 లకు సీఎస్ఎంటీ చేరుకుందని పోలీసులకు తెలుసు.మరుసటి రోజు అదే సమయానికి, ఆ రైలు వచ్చే సమయంలో పోలీసులు నిఘా పెట్టారు.

దీంతో మే 26న మధ్యాహ్నం ప్లాట్ఫామ్ పై ఓ వ్యక్తికి చెప్పులు సరిగా లేకపోవడం, నడక తీరుపై అనుమానం కలగడంతో వెంటనే అతన్ని అదుపులోకి తీసుకున్నారు.ఆ వ్యక్తి పేరు హేమరాజ్ బన్నీవాల్ గుర్తించారు.పోలీసులు విచారించగా రెండు రోజుల క్రితం లేడీస్ కోచ్ లో ఫోన్ దొంగతనం చేశానని, తర్వాత తన స్నేహితుడు దేవీలాల్ చౌహాన్ ( Devilal Chauhan )కు రూ.3500 లకు విక్రయించానని తెలిపాడు.పోలీసులు దేవిలాల్ నుండి ఆ మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకుని ఆ మహిళకు అందించారు.

యంగ్ హీరో విశాల్ రత్నం మూవీ సెన్సార్ రివ్యూ.. ఈ సినిమా టాక్ ఏంటంటే? 

Advertisement

తాజా వార్తలు