ఏపీలో ప్రజా సేవ కోసమే వాలంటీర్ల వ్యవస్థ పుట్టిందని సీఎం జగన్( CM Jagan ) అన్నారు.గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో వాలంటీర్లకు వందనం కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు.
వాలంటీర్లకు నగదు పురస్కారాలు అందజేసిన సీఎం జగన్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.రాష్ట్రంలో ప్రతి పేదవాడికి వారధిగా వాలంటీర్ ఉన్నారని సీఎం జగన్ చెప్పారు.
గతంలో జన్మభూమి కమిటీలు దోపిడీ కోసం పుట్టాయన్నారు.
గత పాలన, వైసీపీ( YCP ) పాలనకు ఉన్న తేడాను గమనించాలని కోరారు.మనం ఏర్పాటు చేసుకున్న వ్యవస్థ బడిని, ఆస్పత్రిని మార్చాయని పేర్కొన్నారు.మనం ఏర్పాటు చేసుకున్న ఆర్బీకే వ్యవస్థ రైతన్నకు చేయూతగా నిలిచిందన్నారు.
అలాగే నవరత్నాలను పేదలకు అందించే యువ సైన్యమే మన వాలంటీర్ల వ్యవస్థ( volunteers system ) అని సీఎం జగన్ తెలిపారు. వాలంటీర్ల సైన్యాన్ని మన ప్రభుత్వం సగర్వంగా చెప్పుకునే సైన్యమని స్పష్టం చేశారు.