నెటిజన్లను కట్టిపడేస్తున్న స్టూడెంట్స్ వీడియో.. చూస్తే మీరూ ఫిదా...

స్కూల్ డేస్ అంటే ప్రతి ఒక్కరికీ ఒక అద్భుతమైన అనుభవం అని చెప్పవచ్చు.ఎందుకంటే పెద్దగా బాధలు లేకుండా స్కూల్ డేస్ ( School days )లో స్నేహితులతో కలిసి ఎంజాయ్ చేయవచ్చు.

 The Students' Video Is Hooking The Netizens, Viral News, Latest News, Trending V-TeluguStop.com

అక్కడే మనం మన జీవితంలో మొదటి స్నేహితులను కలుసుకుంటాం కూడా.ఇంకా ఎన్నో మధురమైన జ్ఞాపకాలను ఏర్పరచుకుంటాం.

అందుకే స్కూల్ డేస్‌ను గుర్తు చేసుకుంటే ఎప్పటికీ మన మనసులో ఆనందం కలుగుతుంది.అయితే అలాంటి స్కూల్ డేస్ గుర్తు చేసే ఒక వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అయింది.

అది చూసి చాలామంది ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళిపోతున్నారు.

సిక్కింలోని గ్యాంగ్‌టక్‌లో( Gangtok, Sikkim ) తీసిన ఈ వీడియో చాలా తక్కువ సమయంలోనే వైరల్ అయింది.ఆ వీడియోలో ఇద్దరు స్కూల్ పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వెళ్తూ కనిపించారు.వారిద్దరూ ఎంతో క్లోజ్ గా ఎంతో హ్యాపీగా ముచ్చట్లు పెట్టుకుంటూ ఇంటికి వెళ్తున్నారు.

అలా వారు ఆప్యాయంగా మాట్లాడుకుంటూ వెళ్లడం చూసి అక్కడున్న వారంతా వారి పాత జ్ఞాపకాలను గుర్తుతెచ్చుకొని ఫిదా అయిపోయారు.కొందరు వీడియో తీశారు.పిల్లలిద్దరూ ఒకరి భుజం మరొకరు చేయి వేసుకుని వెళ్లడమే కాకుండా ఒకరిపై మరొకరు ఎంతో అభిమానాన్ని చూపిస్తూ.సరదాగా కబుర్లు చెప్పుకొంటూ వెళ్లడం చూసే అందరూ ముచ్చట పడ్డారు.

ఈ వీడియో చూసిన చాలా మంది నెటిజన్లు కూడా తమ పాత రోజులను గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ కామెంట్లు చేశారు.

“స్కూల్ డేస్ ఎంతో బాగుండేవి మళ్లీ వస్తే ఎంత బాగుండు” అని కామెంట్ చేస్తున్నారు.ఇప్పుడు ఎన్ని సౌకర్యాలు ఉన్నా అప్పుడు ఏ సౌకర్యాలు లేకపోయినా ఆ డేస్ చాలా బాగున్నాయని ఇంకొందరు కామెంట్ పెట్టారు.అలాంటి ఆనందకరమైన క్షణాలు మళ్లీ రావు అని మరి కొందరు డిసప్పాయింట్‌మెంట్ వ్యక్తం చేశారు.

స్కూల్ డేస్‌లో స్నేహం అనేది చాలా ముఖ్యమైనది.స్నేహితులు లేకుండా స్కూల్ జీవితం పూర్తికాదు.

స్నేహితులతో కలిసి స్కూల్‌కి వెళ్లడం, పాఠాలు చదవడం, ఆటలు ఆడటం వంటివి ఎంతో ఆనందాన్ని ఇస్తాయి.ఈ వీడియో మనందరికీ చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేస్తుంది.

స్కూల్ డేస్‌లో మనకు ఎంతో మంది స్నేహితులు ఉన్నారు.వారితో కలిసి గడిపిన సమయం ఎప్పటికీ మన మనసులో నిలిచిపోతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube