హోమ్‌వర్క్ కోసమై చాట్‌జీపీటీని వాడుకున్న స్టూడెంట్... బిత్తరబోతున్న టీచర్!

The Student Who Used Chatgpt For Homework Is Going To Be A Teacher, ChatGPT, 7th Class Student, Arjun, Homework, Tech News, Viral News, Latest News,

చాట్‌జీపీటీ( chatgpt ) ఇప్పుడు శాస్త్రవేత్తల నుంచి ప్రైమరీ స్కూల్ స్టూడెంట్స్ వరకు బాగా ఉపయోగపడతోంది.దీని నుంచి తెలియని, కావాల్సిన ఆన్సర్లను రాబట్టడం చాలా ఈజీగా మారింది.

 The Student Who Used Chatgpt For Homework Is Going To Be A Teacher, Chatgpt, 7t-TeluguStop.com

ఈ నేపథ్యంలో స్టూడెంట్స్ ఎగ్జామ్‌లో ఆన్సర్లు రాయడానికి ఈ ఏఐ చాట్‌బాట్‌ను తెగ వినియోగిస్తున్నారు.మరి కొందరు హోమ్‌ వర్క్ చేయడానికి దీని హెల్ప్ తీసుకుంటున్నారు.

ఈ క్రమంలోనే అర్జున్( Arjun ) అనే ఒక సెవెంత్ క్లాస్ స్టూడెంట్ చాట్‌జీపీటీని వాడేసి తన హోమ్‌ వర్క్‌ను సింపుల్‌గా కంప్లీట్ చేశాడు.దానిని తన టీచర్ వద్ద సబ్మిట్ చేశాడు.

అయితే ఆ హోమ్‌ వర్క్ చెక్ చేస్తున్న టీచర్‌కి ఒక పేరా వెరైటీగా కనిపించింది.ఆ పేరాలో “యాస్‌ యాన్ ఏఐ లాంగ్వేజ్ మోడల్ ఐ డోంట్ హావ్ పర్సనల్ ఎక్స్‌పక్టెషన్స్‌ ఆఫ్….” అని రాసి ఉండటం కనిపించింది.దాంతో సదరు టీచర్ బిత్తర పోయారు.

దీన్ని చూడగానే టీచర్ కి అది చాట్‌జీపీటీ వినియోగించి కంప్లీట్ చేసిన హోమ్‌ వర్క్ అని అర్థమయింది.ఆ విధంగా స్టూడెంట్ అడ్డంగా బుక్కయ్యాడు.

వాల్‌నట్ CEO రోషన్ పటేల్( Walnut CEO Roshan Patel ) ఈ వివరాలను ట్వీట్ ద్వారా పంచుకున్నారు.తన కజిన్ అర్జున్ హోమ్‌వర్క్ చాట్‌జీపీటీ చేత చేయించి ఎలా అడ్డంగా బుక్కయ్యాడు ట్వీట్ ద్వారా ఆయన వివరించారు.ఫోటోతో పాటు ఆయన షేర్ వివరాలను షేర్ చేశారు.ఇది చూసే చాలామంది ఆశ్చర్యపోతున్నారు.ఏడో తరగతి విద్యార్థులు కూడా చాట్‌జీపీటీపైనే పూర్తిగా ఆధారపడుతున్నారా అంటూ నోరెళ్లబెడుతున్నారు.మరి కొంతమంది మాత్రం ఆ విద్యార్థి “యాస్‌ యాన్ ఏఐ లాంగ్వేజ్ మోడల్ ఐ డోంట్…” అనే రిప్లైని ఎలా రాశాడో అర్థం తలగీక్కుంటున్నారు.

ఇలా రాస్తే పట్టుబడతామని అతడు ఆలోచించకుండా రాసి ఉంటాడా అని ఇంకొందరు సందిగ్ధంలో పడ్డారు.సాధారణంగా సెవెంత్ క్లాస్ స్టూడెంట్స్‌కి చాలా హోమ్‌వర్క్ ఉంటుంది.వారు హోమ్‌వర్క్ పూర్తి చేసేటప్పుడు తమ మైండ్ దాదాపు ఆఫ్ చేసేసి కంప్లీట్ చేయడం పైన శ్రద్ధ పడతారు.దానివల్ల ఈ తప్పు జరిగి ఉండొచ్చని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube