ఆ రాయి రూ. 6 కోట్లట.. అసలు మ్యాటరేంటంటే..?!

దేశంలోదొంగతనాలురోజురోజుకూ పెరిగిపోతున్నాయి.చాలా మంది జల్సాల కోసం, పని లేకపోవడం వల్ల చెడుతిరుగుళ్లకు అలవాటుపడి వ్యసనాలకు దగ్గరవుతున్నారు.

డబ్బు కోసం అడ్డదార్లు తొక్కుతున్నారు.చోరీలు చేయడంలో కూడా తమ తెలివితేటల్ని ప్రదర్శిస్తూ జల్సాగా దోపిడీలు చేసేస్తున్నారు.

పోలీసులకు దొరక్కుండా దర్జాగా బతికేస్తున్నారు.తాజాగా కర్ణాటకలో కూడా ఓ దొంగతనం చోటుచేసుకుంది.

అయితే అది బెడిసికొట్టింది.నకిలీ వజ్రాల ముఠా గుట్టు రట్టు అయ్యింది.ఓ రాయికి ఏకంగా రూ.6 కోట్లు విలువ కట్టి దాన్ని డైమండ్​ అని నమ్మబలికి విక్రయించేందుకు యత్నించారు దుండగులు.ఇంతలో అసలు విషయం బయటపడగా నిందితులు కటకటాల పాలయ్యారు.

Advertisement

ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.కర్ణాటకలో నకిలీ వజ్రాన్ని విక్రయించేందుకు ప్రయత్నించిన కేసులో ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు.

చిక్కబల్లపురాలోని ఓ ముఠా రంగు రాయిని చూపిస్తూ తమకు వజ్రపు రాయి లభించిందని నమ్మబలికింది.దాన్ని విక్రయించేందుకు సిద్దమైంది.దుండగులు ఆ వజ్రాన్ని రూ.6 కోట్లకు విలువకట్టి అమ్మకానికి పెట్టారు.పెట్రోల్​ బంక్ నిర్మాణం కోసం భూమిని వెతికే పనిలో ఉన్న ప్రశాంత్​ వారి కంటపడ్డాడు.

తాము రియల్​ ఎస్టేట్​ వ్యాపారులమంటూ ప్రశాంత్ కు నిందితులు పరిచయమయ్యారు.అయితే వారు దొంగలని, మోసాలు చేస్తారని అతడికి తెలీదు.తమ వద్ద రూ.6 కోట్ల వజ్రపు రాయి ఉందని, అది తమ పొలంలో దొరికిందని దుండగులు చెప్పడంతో ప్రశాంత్ నమ్మాడు.ఆ తర్వాత ఆ వజ్రాన్ని రూ.6 కోట్లకు ఇస్తామని బేరం మాట్లాడారు.దీంతో ప్రశాంత్ అంత సొమ్ము తాను చెల్లించలేనని అన్నారు.అయితే దాన్ని అమ్మేందుకు సహకరిస్తే చాలు రూ.3 కోట్లు కమీషన్​గా ఇస్తామని ఆశచూపారు.దీంతో మూడు కోట్ల రూపాయలు వస్తున్నాయనే ఆనందంలో ఒప్పందానికి ప్రశాంత్ సరేనన్నాడు.

ఆ తర్వాత అది నకిలీదని తేలడం వల్ల నివ్వెరపోవడం ప్రశాంత్​ వంతైంది.వెంటనే పోలీసులకు సమాచారమిచ్చాడు.

ఇదేందయ్యా ఇది.. బాయ్‌ఫ్రెండ్‌పై కోపంతో ఇలా కూడా చేస్తారా..??
వైరల్ వీడియో : టీ20 వరల్డ్ కప్ జట్టును ప్రకటించిన చిన్నారులు..

ఈ కేసులో ప్రధాన నిందితుడైన మంజునాథ్​ సహా అతడికి సహకరించిన మరో నలుగురిని పోలీసులు అరెస్ట్​ చేశారు.ఇటువంటి వారిని నమ్మకుండా ఉండాలని, అనుమానం ఉన్న వ్యక్తులు ఇలా చేస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందివ్వాలని సూచించారు.

Advertisement

తాజా వార్తలు