ఏపీలో 10 లక్షల నకిలీ ఓట్లను తొలగించినట్లు స్పష్టం చేసిన రాష్ట్ర సీఈవో..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు చాలా రసవత్తరంగా సాగుతున్నాయి.ప్రధాన పార్టీల మధ్య మాటలతూటాలు నువ్వా నేనా అన్నట్టుగా పేలుతున్నాయి.

అధికారంలో ఉన్న వైసీపీ( YCP ) పార్టీని ఎలాగైనా గద్దె దించాలని ప్రతిపక్షాలు ముక్తకంఠంతో కామెంట్లు చేస్తున్నాయి.ఇక ఇదే సమయంలో పొత్తులకు సంబంధించి రకరకాల వార్తలు వస్తున్నాయి.

పరిస్థితి ఇలా ఉంటే తాజాగా ఆంధ్రప్రదేశ్( Andhra Pradesh ) రాష్ట్రంలో పది లక్షల ఫేక్ ఓట్లను తొలగించినట్లు రాష్ట్ర సీఈవో ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు.అంతేకాదు వాటి తొలగింపు పై ఇప్పటివరకు ఎలాంటి ఫిర్యాదు రాలేదని స్పష్టం చేశారు.

ఒక ప్రత్యేకమైన సాఫ్ట్ వేర్ తో ఒకే ఫోటోతో ఉన్న 15 లక్షల మంది ఓటర్లు గుర్తించినట్లు దాంతో 2022లో పది లక్షల మందిని గుర్తించి.ఓటరు జాబితా నుంచి తీసివేసినట్లు స్పష్టం చేయడం జరిగింది.గతంలో ఫేక్ ఓట్ల ఉన్నాయన్న ఫిర్యాదులతో ఆ ఓట్లను గుర్తించి తొలగించామని పేర్కొన్నారు.

Advertisement

సాధారణంలో ఓటర్లలో ఒక శాతం పెరుగుదల ఉంటుంది.కానీ మూడు నుంచి నాలుగు శాతం మేర పెరుగుదల ఉండటం గమనించినట్లు.

దీంతో నకిలీ ఓటర్లను పూర్తిగా తొలగించినట్లు రాష్ట్ర సీఈవో ముఖేష్ కుమార్ మీనా( CEO Mukesh Kumar Meena ) వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు