దళిత బంధు నిలిపివేత తరువాత మారిన ఈటెల గ్రాఫ్... ప్రక్కచూపులు అందుకేనా?

హుజూరాబాద్ నియోజకవర్గంలో గత 20 సంవత్సరాలుగా ఈటెల రాజేందర్ ప్రాతినిధ్యం వహించుకుంటూ వస్తున్న సంగతి తెలిసిందే.

ఇక తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనంత వరకు టీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఈటెల రకరకాల కారణాలతో పార్టీ నుండి బయటికి వచ్చిన సంగతి తెలిసిందే.

దీంతో హుజూరాబాద్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక వచ్చిన విషయం అందరికి తెలిసిందే.అయితే గత 20 సంవత్సరాలుగా టీఆర్ఎస్ కు కంచుకోటగా ఉంటూ వస్తున్న హుజూరాబాద్ నియోజకవర్గంలో తప్పక విజయం సాధించాలని టీఆర్ఎస్ కృత నిశ్చయంతో ఉన్న పరిస్థితి ఉంది.

అయితే తాజాగా టీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన దళిత బంధు పధకాన్ని నిలిపివేయాలంటూ బీజేపీ పార్టీ లేఖ రాశారని వార్తలు పెద్ద ఎత్తున హల్ చల్ రేగిన పరిస్థితి ఉంది.అయితే దళిత బంధు నిలిపివేత ముందు వరకు బీజేపీ టీఆర్ఎస్ కంటే పైచేయిగా ఉంటూ వచ్చినా ఎన్నికల కమిషన్ దళిత బంధు నిలిపివేత తరువాత ఒక్కసారియాయ బీజేపీ పార్టీ గ్రాఫ్, ఈటెల గ్రాఫ్ ఒక్కసారిగా పడిపోయింది.

హుజూరాబాద్ నియోజకవర్గంలోని దళితులు ఒక్కసారిగా బీజేపీపై విరుచుక పడ్డ పరిస్థితి ఉంది.దీంతో తమ రాజకీయ ప్రయోజనాల కొరకు దళిత బంధు పధకాన్ని నిలిపివేయించారని ఈటెలపై ప్రజల్లో వ్యతిరేకత పెరగింది.

Advertisement

దీంతో అప్పటివరకు ఎంతో కొంత విజయావకాశాలను కలిగి ఉన్న  ఈటెల తాను విజయావకాశాలను కోల్పోవడమే కాకుండా టీఆర్ఎస్ కు లాభం చేకూర్చిన పరిస్థితి ఉంది.అయితే తాజాగా రేవంత్ తో ఈటెల భేటీ అయినట్లు మంత్రి కెటీఆర్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.

మరి బీజేపీ లో ఇమడలేక ఈటెల పక్క చూపులు చూస్తున్నారా లేక ఓటమిని ముందుగానే అంగీకరించి పార్టీ మారాలని నిర్ణయించుకున్నారా లేక కెటీఆర్ వ్యాఖ్యలు అవాస్తవమా అన్నది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

Advertisement

తాజా వార్తలు