దళిత బంధు నిలిపివేత తరువాత మారిన ఈటెల గ్రాఫ్... ప్రక్కచూపులు అందుకేనా?

హుజూరాబాద్ నియోజకవర్గంలో గత 20 సంవత్సరాలుగా ఈటెల రాజేందర్ ప్రాతినిధ్యం వహించుకుంటూ వస్తున్న సంగతి తెలిసిందే.ఇక తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనంత వరకు టీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఈటెల రకరకాల కారణాలతో పార్టీ నుండి బయటికి వచ్చిన సంగతి తెలిసిందే.

 The Spear Graph That Changed After The Abolition Of The Dalit Kinship ... Are Th-TeluguStop.com

దీంతో హుజూరాబాద్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక వచ్చిన విషయం అందరికి తెలిసిందే.అయితే గత 20 సంవత్సరాలుగా టీఆర్ఎస్ కు కంచుకోటగా ఉంటూ వస్తున్న హుజూరాబాద్ నియోజకవర్గంలో తప్పక విజయం సాధించాలని టీఆర్ఎస్ కృత నిశ్చయంతో ఉన్న పరిస్థితి ఉంది.

అయితే తాజాగా టీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన దళిత బంధు పధకాన్ని నిలిపివేయాలంటూ బీజేపీ పార్టీ లేఖ రాశారని వార్తలు పెద్ద ఎత్తున హల్ చల్ రేగిన పరిస్థితి ఉంది.అయితే దళిత బంధు నిలిపివేత ముందు వరకు బీజేపీ టీఆర్ఎస్ కంటే పైచేయిగా ఉంటూ వచ్చినా ఎన్నికల కమిషన్ దళిత బంధు నిలిపివేత తరువాత ఒక్కసారియాయ బీజేపీ పార్టీ గ్రాఫ్, ఈటెల గ్రాఫ్ ఒక్కసారిగా పడిపోయింది.

హుజూరాబాద్ నియోజకవర్గంలోని దళితులు ఒక్కసారిగా బీజేపీపై విరుచుక పడ్డ పరిస్థితి ఉంది.దీంతో తమ రాజకీయ ప్రయోజనాల కొరకు దళిత బంధు పధకాన్ని నిలిపివేయించారని ఈటెలపై ప్రజల్లో వ్యతిరేకత పెరగింది.

దీంతో అప్పటివరకు ఎంతో కొంత విజయావకాశాలను కలిగి ఉన్న  ఈటెల తాను విజయావకాశాలను కోల్పోవడమే కాకుండా టీఆర్ఎస్ కు లాభం చేకూర్చిన పరిస్థితి ఉంది.అయితే తాజాగా రేవంత్ తో ఈటెల భేటీ అయినట్లు మంత్రి కెటీఆర్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.

మరి బీజేపీ లో ఇమడలేక ఈటెల పక్క చూపులు చూస్తున్నారా లేక ఓటమిని ముందుగానే అంగీకరించి పార్టీ మారాలని నిర్ణయించుకున్నారా లేక కెటీఆర్ వ్యాఖ్యలు అవాస్తవమా అన్నది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube