సముద్రంలో లేదా నదుల్లో వేటకు వెళ్లడం ప్రమాదంతో కూడుకున్న పని.ఒక్కొక్కసారి తుఫాన్లు, వరదలు వచ్చిన సమయంలో ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి.
అలాగే వర్షాల నేపథ్యంలో వచ్చే ఈదురుగాలులకు పడవ బొల్తా పడి చాలామంది ప్రాణాలు కోల్పోతూ ఉంటారు.అయితే జాలర్లకు కొన్ని ప్రమాదకర జంతువుల నుంచి కూడా ప్రమాదం పొంచి ఉంటుంది.
మొసళ్లు, సొరచేపలు ( Crocodiles , sharks )వంటివి సముద్రం, నదుల్లో ఉంటాయి.ఇవి మనుషులను పీక్కు తింటాయి.
దీంతో జాలర్లు వీటిపట్ల జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది.

తాజాగా ఫ్లోరిడాలోని ఎవర్‌గ్లేడ్స్ నేషనల్ పార్క్ ( Everglades National Park in Florida )లో భయానక సంఘటన చోటుచేసుకుంది.పార్కులో ఒక సొరచేప జాలరిపై దాడికి దిగింది.పడవలో జాలరి వెళుతున్న సమయంలో అతడిని నీళ్లల్లోకి లాగేసుకుంది.
జాలరి చేయి కడుక్కొవడం కోసం పడవ నుంచి నీళ్లల్లోకి వంగాడు.ఈ క్రమంలో ఒక సొరచేప దాడి చేసి నీళ్లల్లోకి లాగింది.
జాలరి చేపలవేటకు వెళ్లినప్పుడు ఈ ఘటన జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు.చేపల వేటకు వెళ్లిన సమయంలో చేయి కడుక్కొవాల్సి వచ్చిందని, పడవలో నుంచి వంగి నీళ్లలో కడుక్కుంటుండగా సొరచేప ఒక్కసారిగా దాడి చేసినట్లు చెబుతున్నారు.

ఈ ఘటనలో సొరచేప జాలరి చేయిని కోరికేసింది.అయితే సొరచేప నీళ్లల్లోకి లాక్కునేటప్పుడు పక్కనే ఉన్న స్నేహితుడు జాలరిని కాపాడాడు.సొరచేప లాగడంతో జాలరి పడవలో నుంచి నీళ్లల్లోకి పడిపోయాడు.అయితే అప్రమత్తమైన స్నేహితుడు వెంటనే అతడిని పడవపైకి లాగేశాడు.దీంతో సొరచేప బారి నుంచి బయటపడ్డాడు.సొరచేప నుంచి బయటపడటంతో స్థానికులు అందరూ ఊపిరిపీల్చుకున్నారు.
పక్కనే ఉన్న స్నేహితుడు సహాయం చేసి ఉండకపోతే పెను ప్రమాదం జరిగి ఉండేది.జాలరిని సొరచేప లాక్కెళ్లి చంపేసి ఉండేదని చెబుతున్నారు.
చేపలవేటకు వెళ్లేటప్పుడు ఇలాంటి ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి.







