టీడీపీలో శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే ఎన్సీపీ నాయుడు చేరికకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.ఈ క్రమంలో రేపు చంద్రబాబు సమక్షంలో ఆయన టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారు.
అయితే గతంలో నాయుడు చేరికను శ్రీకాళహస్తి టీడీపీ ఇంఛార్జ్ బొజ్జల సుధీర్ రెడ్డి అడ్డుకున్న సంగతి తెలిసిందే.పార్టీ అధిష్టానం సూచనతో నాయుడును సుధీర్ రెడ్డి పార్టీలోకి ఆహ్వానించారు.







