చదువు లేదా ఉద్యోగాల కోసం ఎంతోమంది విదేశాలకు వెళుతూ ఉంటారు.విదేశాలకు వెళ్లాలంటే చాలా ప్రాసెస్ ఉంటుంది.
పాస్ పోర్ట్, వీసా కలిగి ఉండాలి.పాస్ పోర్ట్ రావడం సులువే.
కానీ వీసా కోసం చాలా ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది.వీసా అంత సులువుగా రాదు.
ఇందుకోసం చాలామంది కన్సల్టెన్సీ ఏజెన్సీ(Consultancy Agency )లను ఆశ్రయిస్తూ ఉంటారు.వారికి పెద్ద మొత్తంలో డబ్బులు కట్టి వీసా లాంటివి సలువుగా వచ్చేలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.

అయితే విదేశాలు వెళ్లేటప్పుడు కొన్ని విషయాలు తెలుసుకోవాలి.లేకపోతే అక్కడకు వెళ్లిన తర్వాత ఇబ్బందులు పడాల్సి ఉంటుంది.మీరు విదేశాలకు వెళ్లేటప్పుడు ఎన్‌ఆర్‌ఐ అకౌంట్( NRI Account ) ఓపెన్ చేయడం లేదా ఇప్పటికే ఉన్న అకౌంట్‌ను బదిలీ చేయడం చేయాలి.దీని వల్ల మీ డబ్బులు ఇండియన్ రూపాయిల్లో ఉంటాయి.
అలాగే ఇండియాలో ఉంటున్న వ్యక్తులకు యూపీఐ పేమెంట్స్ చేయడానికి లేదా డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ ఉపయోగించుకోవాడానికి ఈ అకౌంట్ చాలా ఉపయోగపడుతుంది.</br

అలాగే మ్యూచువల్, ఈక్విటీ ఫండ్స్‌కి సంబంధించి మీ కేవైసీ వివరాలను అప్డేట్ చేసుకోవాలి.మీ డీమ్యాట్ లేదా మ్యూచువల్ ఫండ్ అకౌంట్‌ను ఎన్‌ఆర్ఐ బ్యాంక్ అకౌంట్‌తో లింక్ చేసుకోవడం మంచిది.అంతేకాకుండా దేశీయ క్రెడిట్ కార్డులను( Credit card ) క్లోజ్ చేసుకోవడం మంచిది.
లోకల్ గా వాడే క్రెడిట్ కార్డులను విదేశాల్లో ఉపయోగిస్తే ఎక్సేంజ్ ఛార్జీలు ఎక్కువగా పడతాయి.వీటితో పాటు హౌసింగ్ ఇన్యూరెన్స్, లైఫ్ ఇన్యూరెన్స్ కూడా ఉండటం అవసరం.
అంతేకాకుండా మీ ఈపీఎఫ్ డబ్బులను విత్ డ్రా చేసుకోండి.వీసా కాపీ, అపాయింట్‌మెంట్ లెటర్ ను సమర్పించి మీ పీఎఫ్ డబ్బులను విత్ డ్రా చేసుకోండి.
ఇవన్నీ పాటించడం ద్వారా మీకు ఎలాంటి ఇబ్బంది జరగదు.







