ఉద్యోగులపై ప్రభుత్వం ధీమాగానే ఉందా?

గత కొంతకాలం వరకు ఉప్పు నిప్పుగా సాగిన ఉద్యోగ సంఘాలు vs ఏపీ ప్రభుత్వం మధ్య పరిస్థితి ఇప్పుడు కొంత సాధారణ స్థితి కి వచ్చినట్టుగా కనబడుతుంది.2019 ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా ఉద్యోగ వర్గాల వారికి కొన్ని హామీలను ప్రకటించారు జగన్.( CM Jagan ) అందులో ముఖ్యమైనది సిపిఎస్ రద్దు పాత పెన్షన్ విధానాన్ని మళ్ళీ తీసుకొస్తానని ,అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోపే cps విదానం రద్దు చేస్తానంటూ జగన్ ఇచ్చిన హామీ ఉద్యోగ వర్గాలు ఫిదా అయ్యాయి .దాంతో జగన్ విజయానికి వారు తమ వంతు కష్టపడ్డారు.అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత అది ఎంత కష్టమైన వ్యవహారమో అర్ధమైన జగన్ ఆ విషయంపై మిన్నకుండిపోయారు.

 Ap Employees Happy With Govt Or Nor Details, Ap Govt, Ap Govt Employees, Sajjala-TeluguStop.com
Telugu Ap, Ap Employees, Cmjagan-Telugu Political News

cps పై అవగాహన లేక జగన్ అలాంటి హామీ ఇచ్చారు అన్న సజ్జల( Sajjala Ramakrishna Reddy ) వ్యాఖ్యలపై మండిపడిన ఉద్యోగ సంఘాలు పోరుబాట పట్టారు.అయితే ఉద్యోగ సంఘాల నిరసనలు ప్రభుత్వం పట్టించుకోలేదు.దాంతో ప్రభుత్వానికి ఉద్యోగులకు మధ్య గ్యాప్ పెరిగిపోయింది .ఇదే పరిస్థితి కొనసాగితే వచ్చే ఎన్నికలలో తమకు ఇబ్బందికర పరిస్థితి ఉంటుందని గ్రహించిన ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు పూనుకుంది.దాంట్లో భాగంగానే కాంట్రాక్టు ఉద్యోగులను( Contract Employees ) క్రమబద్ధీకరించడం, సెక్రటేరియట్ ఉద్యోగులకు ఐదు రోజుల పని విదానాన్ని కొనసాగించడం, మెరుగైన జిపిఎస్ విధానాన్ని తీసుకురావడం,

Telugu Ap, Ap Employees, Cmjagan-Telugu Political News

సెలవులను ఎన్కాష్మెంట్ చేసుకునే పద్ధతిని ప్రవేశపట్టడం ఇలా కొన్ని ఉద్యోగ వర్గాలు నాకట్టుకునే చర్యలు తీసుకుంది.దీంతో ఉద్యోగులలో అసంతృప్తి కొంతమేర తగ్గినట్టుగా వార్తలు వచ్చాయి.చెప్పుకోదగ్గ స్థాయిలోనే ఉద్యోగుల అసంతృప్తి చల్లారిందని , వచ్చే ఎన్నికలలో ఉద్యోగ వర్గాల నుంచి తమకు పెద్దగా ఇబ్బంది ఉండదని ప్రభుత్వం భావిస్తుంది.

మరి ప్రస్తుతానికి ప్రబుత్వ చర్యల పై గుమ్మనంగా ఉన్న ఉద్యోగ వర్గాలు నిజం గానే సంతృప్తి చెందాయా వచ్చే ఎన్నికల లో ఉద్యోగులు ఎలా ప్రతిస్పందిస్తారు అన్నది ప్రశ్నగా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube