జనసేన అధినేత పవన్ కల్యాణ్ నిర్వహించనున్న నాలుగో విడత వారాహి యాత్రకు షెడ్యూల్ ఖరారు అయింది.ఈ మేరకు అక్టోబర్ 1వ తేదీన ఉమ్మడి కృష్ణా జిల్లాలోని అవనిగడ్డ నుంచి యాత్రను ప్రారంభించనున్నారు.
అక్టోబర్ 6వ తేదీ వరకు పవన్ వారాహి యాత్ర కొనసాగనుంది.కాగా ఈ యాత్రలో భాగంగా ఉమ్మడి కృష్ణా జిల్లాతో పాటు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల్లో పవన్ కల్యాణ్ పర్యటించనున్నారు.
అవనిగడ్డ, బందరు, పెడన, ఏలూరుతో పాటు పాలకొల్లు నియోజకవర్గాల్లో జనసేనాని పర్యటిస్తారు.అయితే చంద్రబాబు అరెస్టును వ్యతిరేకించిన జనసేనాని టీడీపీతో పొత్తు ప్రకటించిన తరువాత నిర్వహించే యాత్ర కావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది.







