వైరల్ వీడియో: సింహంతో సరసాలాడితే ఇలాగే ఉంటుంది.. ఒళ్ళు గగుర్పొడిచే సంఘటన చూడండి!

మనిషికి ఓవర్ కాన్ఫిడెన్స్ ఎప్పుడూ పనికిరాదు.అందులోనూ, మన ఎదుట వున్నది చాలా ప్రమాదకరం అని తెలిసినపుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలి.

 The Same Is True If Flirting With A Lion Viral Latest, News Viral, Social Media, Lion , Viral Video-TeluguStop.com

లేదంటే మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది.ఇక్కడ సరిగ్గా అలాంటి సంఘటనే జరిగింది.

ఓ వ్యక్తి గొప్పలకుపోయి, ఏకంగా తన చేతి వేళ్ళను సింహానికి ఆహారంగా సమర్పించుకున్నాడు.ఈ సంఘటనకి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.

 The Same Is True If Flirting With A Lion Viral Latest, News Viral, Social Media, Lion , Viral Video-వైరల్ వీడియో: సింహంతో సరసాలాడితే ఇలాగే ఉంటుంది.. ఒళ్ళు గగుర్పొడిచే సంఘటన చూడండి-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

వీడియో చూసిన నెటిజన్లు షాక్‌ అవుతున్నారు.ఒళ్ళు గగుర్పొడిచేలా వుండే ఆ వీడియో మీరు కూడా ఓ సరి తిలకించండి, మరియు మీ పిల్లలకు చూపించి, ఇలాంటి పిచ్చిపనులు ఎపుడు చేయకూడదని చెప్పండి.

అసలు విషయంలోకి వెళితే, వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో ఒక జంతుప్రదర్శన శాలలో సింహం బోనులో హాయిగా వుంది.అయితే అక్కడ వున్న ఒక వ్యక్తి సింహాంతో సరదాగా పరాచకాలాడుతుంటాడు.

అతడి చేతిని సింహం నోట్లో పెడుతూ, తీస్తూ ఆటపట్టిస్తుంటాడు.పలుమార్లు సింహం నోటినుండి తప్పించుకున్న అతని చేయి ఒక్కసారిగా సింహం నోటిలో ఇరుక్కుపోతుంది.

అంటే సింహం గట్టిగా పట్టుకుంటుంది.ఇంకేముంది ఎంత లాగినా విడిచిపెట్టదు.

చివరకి ఆ వ్యక్తి వేలుని పోగట్టుకునే పరిస్థితి దాపురిస్తుంది.

ఈ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది.వీడియో చూసిన నెటిజన్లు అనేకరకాల కామెంట్లు చేస్తున్నారు.కొందరు దూలతీరిందా? అని అంటే, మరికొందరు అట్లుంటది మరి సింహం తోటి! అని అంటున్నారు.ఇంకోమందైతే పిల్లలకు ఈ వీడియో చూసి ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తే ఏమవుతుందో తెలియజేయండి అని క్లాసులు పీకుతున్నారు.కాగా ఈ సంఘటన జమైకా జంతుప్రదర్శనశాలలో జరిగినట్లు భావిస్తున్నారు.

దీనిని ఒక నెటిజన్ ట్విట్టర్‌లో షేర్‌ చేసి, ‘నటన కొన్నిసార్లు ఖరీదైనది అవుతుంది.’ అనే క్యాప్షన్ రాశాడు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube