ఫిబ్రవరి 1 నుంచి అమలుకానున్న రూల్స్.. 2 రోజుల్లోనే పని అయిపోతుంది!

ఇంకో 2 రోజుల్లో ఫిబ్రవరి నెల వచ్చేస్తుంది.ఇక కొత్త నెల వస్తూనే కొత్త రూల్స్‌ కూడా తీసుకు వస్తుందండోయ్.

 The Rules Will Be Implemented From February 1 The Work Will Be Done In 2 Days-TeluguStop.com

అవును, ఫిబ్రవరి 1 నుంచి ఓ కొత్త రూల్ ఒకటి అమలులోకి రాబోతోంది.ఈ కొత్త రూల్ వలన చాలా మందికి ఊరట చేకూరనుంది.

ముఖ్యంగా మ్యూచువల్ ఫండ్స్‌లో డబ్బులు పెట్టే వారికి కొత్త రూల్ వల్ల ప్రయోజనం చేకూరనుంది.మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసే వారికి ఇకపై తమ డబ్బులు త్వరగా తమతమ అకౌంట్లలోకి వచ్చేస్తాయి.

అంటే మ్యూచువల్ ఫండ్స్ విక్రయిస్తే.త్వరితగతిన డబ్బులు మీ బ్యాంక్ అకౌంట్‌లోకి వచ్చి చేరతాయి.

Telugu February, India, Trade-Latest News - Telugu

AMC (అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీలు) ఫిబ్రవరి నెల నుంచి మ్యూచువల్ ఫండ్స్ యూనిట్ల విక్రయం తర్వాత టీ ప్లస్ 2 విధానంలో సెటిల్‌మెంట్ చేస్తారు.అంటే మ్యూచువల్ ఫండ్స్‌ను అమ్మేసిన రోజు కాకుండా తర్వాతి రెండు రోజుల్లో డబ్బులు ఇన్వెస్టర్ల అకౌంట్లలోకి వస్తాయన్నమాట.స్టాక్ మార్కెట్‌లో జనవరి 27న యాంఫీ ఈ విషయాన్ని వెల్లడించడం కొసమెరుపు.ఈక్విటీ స్కీమ్స్‌కు ఈ టీ ప్లస్ 2 రూల్ వర్తిస్తుందని పేర్కొంది.అంటే ట్రేడ్ చేసిన డేట్ ప్లస్ 2 రోజులు… మొత్తంగా ఈ రోజు ట్రేడ్ చేస్తే.వచ్చే 2 రోజుల్లోగా మీ డబ్బులు మీకు వచ్చేస్తాయి.

Telugu February, India, Trade-Latest News - Telugu

అలాగే ఈ రోజు షేర్లు కొంటే తర్వాతి రోజు కల్లా షేర్లు మీ డీమ్యాట్ ఖాతాలోకి వచ్చేస్తాయని గుర్తు పెట్టుకోండి.జనవరి 27 నుంచి ఈ టీ ప్లస్ 1 సెటిల్‌మెంట్ విధానం అమలులోకి వచ్చింది.స్టాక్ మార్కెట్‌లో టీ ప్లస్ 1 సెటిల్‌మెంట్ పేమెంట్ విధానం ప్రపంచంలోనే తొలి సారిగా మన దేశంలోనే అమలు కావడం విశేషం.ఈ క్రమంలో ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్‌ విభాగంలో కూడా పెను మార్పులు తెచ్చారు.

ట్రేడ్ సెటిల్‌మెంట్ ప్రక్రియను టీ ప్లస్ 3 నుంచి టీ ప్లస్ 2కు తగ్గించారు.అందువల్ల త్వరితగతిన సెటిల్‌మెంట్ పూర్తి అవుతుంది.డబ్బులు అందుబాటులోకి వస్తాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube