అవతార్ 2 తెలుగు రాష్ట్రాల్లో సెన్సేషనల్ వసూళ్లు.. ఎన్ని కోట్లు రాబట్టిందంటే?

2022 ఏడాది లో మన ఇండియా బాక్సాఫీస్ దగ్గర ఎన్నో సినిమాలు రిలీజ్ అయ్యాయి.బాక్సాఫీస్ దగ్గర పాన్ ఇండియా సినిమాలు కూడా ఎన్నో వచ్చి బాక్సాఫీస్ ను బద్దలు కొట్టే రికార్డులను క్రియేట్ చేసారు.

 Record Breaking Opening For Avatar 2 In Telugu States Details, Avatar 2, Hollywo-TeluguStop.com

అయితే ఇప్పుడు ఇండియన్ సినిమాలు క్రియేట్ చేసిన రికార్డులను తుడిచి పెట్టేందుకు హాలీవుడ్ రంగంలోకి దిగింది.ఈ ఏడాదికి ఫైనల్ టచ్ గా హాలీవుడ్ మూవీ అవతార్ 2 గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది.

ఇండియాలో భారీ ఎత్తున రిలీజ్ కాబోతుంది.ఈ సినిమా రిలీజ్ కాకుండానే మన సినిమాలు పాన్ ఇండియా వ్యాప్తంగా క్రియేట్ చేసిన రికార్డులను బ్రేక్ చేసింది.ఇక ఇప్పుడు రిలీజ్ తర్వాత మిగిలి ఉన్న రికార్డులను సైతం బద్దలు కొట్టేందుకు రెడీ అయ్యింది.అవతార్ 2 వస్తుంది అంటే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మూవీ లవర్స్ ఎదురు చూసారు.

బిగ్గెస్ట్ విజువల్ ట్రీట్ ‘అవతార్ 2’ ను హాలీవుడ్ టాప్ డైరెక్టర్ జేమ్స్ కెమరూన్ తెరకెక్కించాడు.

ఈ సాలిడ్ విజువల్ అండ్ ఎమోషనల్ చిత్రం నిన్న డిసెంబర్ 16న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది.మన ఇండియన్ సినిమా దగ్గర కూడా ఈ సినిమా రికార్డ్ బ్రేకింగ్ ఓపెనింగ్స్ అందుకుంటుంది.ఇక ఈ సినిమా తెలుగులో కూడా చాలా గ్రాండ్ గా రిలీజ్ అవ్వగా ఓపెనింగ్స్ కూడా బాగా వచ్చాయట.

ఇక తాజాగా ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఎంత ఓపెనింగ్ సాధించిందో బయటకు వచ్చింది.

ఈ సినిమా మొదటి రోజు భారీ ఓపెనింగ్స్ రాబట్టాయి.ట్రేడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా తెలుగులో ఓపెనింగ్స్ వసూళ్లు ఎంత వచ్చాయి అంటే.తెలుగులో ఈ సినిమా ఫస్ట్ డే 14 కోట్ల గ్రాస్ రాబట్టినట్టు తెలుస్తుంది.

హాలీవుడ్ నుండి వచ్చిన సినిమాల్లో ఇదే హైయెస్ట్ రికార్డ్ అనే చెప్పాలి.దాదాపు 3 గంటల నిడివి ఉన్నప్పటికీ ఆడియెన్స్ వెనకడుగు వేయకపోవడం విశేషం.

ఇది ఇలాగె కొనసాగితే మరిన్ని అంచనాలు క్రియేట్ చేయడం ఖాయం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube