భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించినా అభిమానుల్లో ఏ మాత్రం క్రేజ్ తగ్గలేదు.ఇక టీమిండియా కెప్టెన్‌గా దేశానికి రెండు ప్రపంచకప్‌లు అందించిన ఘనత అతడి సొంతం.
ధోనీ తన క్రికెట్ కెరీర్‌లో ఇప్పటి వరకు ఎన్నో రికార్డులను నెలకొల్పాడు.అయితే ధోనీ 7వ నంబర్ జెర్సీ ఎందుకు ధరించాడో ఎప్పుడైనా గమనించారా? దీని వెనుక రహస్యం ఏమిటి? సంబంధిత వివరాలను తెలుసుకుందాం.
ఇటీవల బ్రాండ్ అంబాసిడర్‌గా ఓ ఈవెంట్‌కి ధోనీ వచ్చాడు.అక్కడ 7వ నంబర్ జెర్సీని ఎందుకు ధరిస్తారని మీడియా ప్రతినిధులు అడిగారు.ఈ సందర్భంగా దాని వెనుక కారణాలను ఈ కెప్టెన్ కూల్ వెల్లడించాడు.తాను ఫుట్‌బాల్ ఆడేటప్పుడు తన జెర్సీ నంబర్ 22 ఉండేదన్నారు.
తాను టీమ్ ఇండియాకు ఎంపికయ్యే సరికి ఒక్క జెర్సీ ఖాళీగా ఉందని తెలుసుకున్నానన్నారు.అలా 7వ నంబరు జెర్సీ ధరించడం మొదలు పెట్టానన్నారు.
అది తన లక్కీ నంబరుగా అందరూ భావిస్తుంటారన్నారు.అయితే అది తన పుట్టిన రోజు అని ఎవరూ గమనించరని సీక్రెట్ వెల్లడించాడు.
ధోనీ అభిమాన ఆటగాళ్లు డేవిడ్ బెక్‌హామ్, క్రిస్టియానో రొనాల్డోల జెర్సీ నంబర్ కూడా 7.అందుకే ఈ నంబర్‌ను అదృష్టంగా భావించి కెప్టెన్ ధోనీ తన జెర్సీ నంబర్‌గా కొనసాగించాడు.ఇక ధోనీ 7 జూలై 1981న రాంచీలో జన్మించాడు.

డిఫెండింగ్ ఛాంపియన్‌గా చెన్నై సూపర్ కింగ్స్ 2022లో బరిలోకి దిగుతోంది.మార్చి 26న కోల్‌కతా నైట్ రైడర్స్‌తో తొలి మ్యాచ్ ఆడనుంది.ఇటీవల సీఎస్‌కే జట్టులో కీలక ఆటగాళ్లు ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్, ఆల్ రౌండర్ దీపక్ చాహర్ గాయాల బారిన పడడం ఆందోళన కలిగించింది.
చాహర్ ఎప్పుడు జట్టులో చేరతాడో స్పష్టత లేదు.అయితే సూరత్ మైదానంలో సీఎస్‌కే జట్టుతో పాటు రుతురాజ్ గైక్వాడ్ చేరాడు.దీంతో సీఎస్‌కే యాజమాన్యం సంతోషంలో మునిగిపోయింది.